News


జుబిలెంట్‌కు కలిసొచ్చిన క్యూ1

Tuesday 18th July 2017
Markets_main1500319390.png-5525

  • లాభం 25 శాతం వృద్ధితో రూ.24 కోట్లకు

న్యూఢిల్లీ: డోమినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ పేరుతో రిటైల్‌స్టోర్స్‌ను నిర్వహిస్తున్న జుబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ జూన్‌ త్రైమాసికంలో మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత స్టోర్స్‌ విక్రయాలు పుంజుకోవడంతో కంపెనీ లాభం రూ.24 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.19 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరుగుదలతో రూ.612 కోట్ల నుంచి రూ.682 కోట్లకు చేరింది. ఈ మేరకు ఫలితాల సమాచారాన్ని కంపెనీ బీఎస్‌ఈకి తెలియజేసింది. గతేడాది జూన్‌ క్వార్టర్‌లో ఒక స్టోర్‌ నుంచి వచ్చే ఆదాయంలో వృద్ధి 3.2 శాతంగా ఉండగా, ఈ ఏడాది జూన్‌ క్వార్టర్లో అది 6.5 శాతానికి మెరుగుపడడం కంపెనీ అధిక లాభాలకు తోడ్పడింది. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, వ్యయ నియంత్రణకు సంబంధించి జూన్‌ త్రైమాసికంలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం పనితీరుకు మెరుగుపడడానికి దోహదపడిందని కంపెనీ చైర్మన్‌ శ్యామ్‌ ఎస్‌ భార్తియా, కో చైర్మన్‌ హరి ఎస్‌ భార్తియా తెలిపారు. కంపెనీకి ప్రస్తుతం 1,125 డామినోస్‌ పిజ్జా, 55 డంకిన్‌ డోనట్స్‌ ఔట్‌లెట్లున్నాయి. జూన్‌ క్వార్టర్లో కంపెనీ 5 పిజ్జా ఔట్‌లెట్లను మూసేయగా, కొత్తగా 13 ఔట్‌లెట్లను తెరిచింది. మరోవైపు కంపెనీకి ‍ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వోగా ఉన్న సచిన్‌శర్మ రాజీనామా చేసినట్టు జుబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది. ఆయన స్థానంలో బోర్డు మరొకరిని నియమిస్తుందని స్పష్టం చేసింది. గత ఏడాదిలో కంపెనీ టాప్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో చోటు చేసుకున్న రెండో రాజీనామా ఇది. సీఈవోగా ఉన్న అజయ్‌కౌల్‌ కొన్ని నెలల క్రితం కంపెనీని వీడారు. 







You may be interested

ఐటీ జాబ్‌లు కష్టమే!!

Tuesday 18th July 2017

 కొత్త కొలువులకు ఆటోమేషన్‌, కొత్త టెక్నాలజీల సెగ...  క్యూ-1లో దిగ్గజాల నియామకాల్లో తిరోగమనం...  టీసీఎస్‌, ఇన్ఫీల్లో చేరినవారికన్నా మానేసినవారే ఎక్కువ  టీసీఎస్‌లో 1,414 మంది, ఇన్ఫీలో 1,811 మంది తగ్గుదల...  కోతలు లేవంటూనే.. జోరు తగ్గించామంటున్న కంపెనీలు  మానేసిన వారిలో... తీసేసిన వారూ ఉండొచ్చన్న నిపుణులు ఉద్యోగాల కల్పవృక్షంగా చెప్పుకునే ఐటీ పరిశ్రమ.. ఇప్పుడు కొత్త కొలువుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ప్రధానంగా ఆటోమేషన్‌కు తోడు డిజిటల్‌, క్లౌడ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) దిశగా అడులేస్తున్న ఐటీ కంపెనీలు..

ఐపీఓకు ఎస్‌బీఐ లైఫ్‌ దరఖాస్తు

Tuesday 18th July 2017

రూ.6,500-రూ.7,000 కోట్ల సమీకరణకు ప్రతిపాదన ముంబై: జీవిత బీమా రంగంలోని ప్రముఖ కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.6,500-7,000 కోట్లను సమీకరించనుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 12 కోట్ల షేర్లను ఐపీవోలో భాగంగా ప్రమోటర్లు విక్రయించనున్నారు. మొత్తం జారీ మూలధనంలో 12 శాతానికి సమానం. ఎస్‌బీఐ 8 కోట్ల షేర్లు, బీఎన్‌పీ పరిబాస్‌ కార్డిఫ్‌

Most from this category