STOCKS

News


జేకే లక్ష్మి సిమెంట్ 15 శాతం డివిడెండ్‌

Wednesday 16th May 2018
news_main1526489942.png-16532

న్యూఢిల్లీ: జేకే లక్ష్మి సిమెంట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.34 కోట్ల (స్టాండెలోన్‌) నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 21 కోట్లతో పోలిస్తే ఇది 62 శాతం అధికం. తాజాగా క్యూ4లో ఆదాయం రూ. 923 కోట్లు కాగా, గత క్యూ4లో రూ. 931 కోట్లు. గతేడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని సంస్థ తెలిపింది. 2018 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై 0.75 పైసలు చొప్పున (15 శాతం) డివిడెండ్ చెల్లించాలంటూ కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. మరోవైపు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జేకే లక్ష్మి సిమెంట్ నికర లాభం 50 శాతం క్షీణించి రూ. 87 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం రూ. 3,414 కోట్ల నుంచి రూ. 3,929 కోట్లకు పెరిగింది. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు 0.04 శాతం పెరిగి రూ. 383 వద్ద ముగిసింది. 



You may be interested

‘సౌండ్‌’తో పేమెంట్‌

Wednesday 16th May 2018

పరీక్షల దశలో కొత్త చెల్లింపుల విధానం పలు సంస్థలతో కలసి ఎన్‌పీసీఐ ప్రయత్నాలు డిజిటల్‌ చెల్లింపులను పెంచడంపై దృష్టి న్యూఢిల్లీ: కొత్త చెల్లింపుల విధానం త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తు‍న్నాయి. డిజిటల్‌ చెల్లింపులను పెంచే లక్ష్యంలో భాగంగా శబ్ధం ఆధారిత చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రయత్నాలు మొదలు పెట్టింది. శబ్ధం ఆధారిత చెల్లింపుల విధానాన్ని పరీక్షించేందుకు ఫోన్‌పే, టోన్‌ట్యాగ్‌, అల్ట్రా క్యాష్‌ అనే మూడు సంస్థలతో

టెలినార్‌ ఉద్యోగుల కష్టాలు

Wednesday 16th May 2018

ఇంటికి పంపేందుకు సిద్ధమౌతోన్న ఎయిర్‌టెల్‌   హైదరాబాద్‌: టెలినార్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ విలీనం టెలినార్‌ ఉద్యోగుకుల శాపంగా మారింది. కొంత మందిని ఇంటికి సాగనంపడానికి ఎయిర్‌టెల్‌ సిద్ధమౌతోంది. ఈ విషయానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌ నుంచి టెలినార్‌ ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. విలీనం అనంతరం టెలినార్‌ ఇండియాలోని ఉద్యోగులందరూ ఎయిర్‌టెల్‌లో సరైన స్థాయి ఉద్యోగానికి పొందలేరని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కాగా టెలికం విభాగం మే 14న భారతీ ఎయిర్‌టెల్‌, టెలినార్‌ ఇండియా

Most from this category