STOCKS

News


దిగ్గజాలూ నష్టపోయారు!

Tuesday 6th February 2018
Markets_main1517904079.png-13723

అయినా వాల్యూ బయింగ్‌వైపే మొగ్గు
మార్కెట్లో చోటు చేసుకుంటున్న భారీ కరెక‌్షన్‌ ప్రభావం మార్కెట్‌ గురువులుగా పేరొందిన దిగ్గజ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలను సైతం తినేస్తోంది. తాజా కరెక‌్షన్‌లో రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా, డాలీఖన్నా లాంటి ప్రముఖ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలు దాదాపు 30 శాతం పైగా నష్టాల్లో ఉన్నాయి. అయితే ఈ పరిణామాల పట్ల వారు ఆందోళన చెందడంలేదు. ఇలాంటి తరుణంలో బలహీనమైన మనస్థత్వం ఉన్నవారంతా నష్టాలను మూట కట్టుకొని వైదొలుగుతారు, సరైన ప్రణాళిక ఉన్నవారు ఇలాంటప్పుడే వాల్యూబయింగ్‌ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆరంభ స్థాయి నుంచి ఇప్పటివరకు రాకేశ్‌ పోర్టుఫోలియోలో స్టాకులు దాదాపు 34 శాతం వరకు క్షీణించాయి. రాకేశ్‌ వద్ద ఉన్న షేర్లలో ఆప్‌టెక్‌ 34 శాతం, జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ 27 శాతం, ఎంసీఎక్స్‌ 27.12 శాతం, అనంత్‌రాజ్‌ 26 శాతం నష్టపోయాయి. దాదాపు 30కి పైగా కంపెనీల్లో రాకేశ్‌కు ఒక శాతానికి పైగా వాటా ఉంది. వీటిలో దాదాపు మూడింట రెండొంతుల స్టాకులు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలీఖన్నా పోర్టుఫోలియోలో స్టెర్లింగ్స్‌ టూల్స్‌ 19 శాతం, ద్వారికేశ్‌ సుగర్స్‌ 20 శాతం, నందన్‌ డెనిమ్‌ 21 శాతం, ఎమ్‌కేగ్లోబల్‌ 20 శాతం నష్టపోయాయి. ఆశిష్‌ కచోలియా హోల్డింగ్స్‌ సైతం దాదాపు 20 శాతం మేర పతనమయ్యాయి. అయితే వీరంతా తాజా కరెక‌్షన్‌లో కొత్త కొనుగోళ్లను ఆచితూచి జరుపుతున్నారు. ఉదాహరణకు సోమవారం దాదాపు 3లక్షల షైలీ ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్స్‌ షేర్లను ఆశిష్‌ కొనుగోలు చేశారు. 



You may be interested

సిప్‌ ఆపొద్దు, ఆందోళన వద్దు: జియోజిత్‌ ఫైనాన్షియల్‌

Tuesday 6th February 2018

ముంబై: స్టాక్‌ సూచీలు భారీగా పతనం అయిపోతున్నాయనే ప్యానిక్‌ వద్దని, కుదిరితే మరింతగా పెట్టుబడులు పెంచేందుకు ఇదే సరైన సమయం అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ పతనానికి అనుగుణంగా దేశీయ సూచీలు పడిపోతున్నాయని అన్న ఆయన ఇన్వెస్టర్లు దీర్ఘకాల రాబడిని దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులను పెంచడం మంచి నిర్ణయం అవుతుందని అన్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ (సిప్‌) ద్వారా

మార్కెట్‌ పతనానికి 5 కారణాలు ఇవే..!

Tuesday 6th February 2018

ముంబై: స్టాక్‌ సూచీలు మంగళవారం భారీ పతనాన్ని నమోదుచేశాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1,274 పాయింట్లు నష్టపోయి 33,483 వద్దకు పడిపోగా.. నిఫ్టీ 10,300 స్థాయికి కుంగిపోయింది. ఈ నేపథ్యంలో కేవలం క్షణాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయిల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. రూ.5,40,000 కోట్ల సంపద ఆవిరైపోయినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల డేటాలో వెల్లడయ్యింది. ఇంతటి మహా పతనానికి వెనక ఉన్న కారణాలను ఒకసారి పరిశీలిస్తే..  అమెరికా సూచీల భారీ పతనం: డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌

Most from this category