STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు 34శాతం క్రాష్‌

Thursday 18th April 2019
Markets_main1555578438.png-25207

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఆ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. నిధుల లేమితో అల్లాడిపోతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించాయి. దీంతో జెట్‌ తన ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారం రాత్రి అమృత్‌సర్‌ నుంచి దిల్లీకి నడుపుతున్న విమానమే ఆఖరిదని సంస్థ నిన్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో షేర్లు 10శాతం నష్టంతో రూ.217.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేరు విక్రయాలకు మొగ్గుచూపడం‍తో 34శాతం నష్టపోయి రూ.159.40ల ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గత ముగింపు ధర(రూ.241.85)తో పోలిస్తే 33 శాతం క్షీణించి రూ.162ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది షేరు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.162.10లు రూ.650.50లుగా నమోదయ్యాయి.



You may be interested

ఆర్‌ఐఎల్‌ ఆప్షన్‌ విక్రేతలకు ఎదురుదెబ్బ

Thursday 18th April 2019

గురువారం ఫలితాల అనంతరం ఆర్‌ఐఎల్‌ షేరులో భారీ పెరుగుదల ఉంటుందని భావించిన పలువురు ఆప్షన్‌ సెల్లర్లకు గురువారం ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంపెనీ రిఫైనింగ్‌ వ్యాపారంలో సౌదీ అరామ్‌కో మైనార్టీ వాటా కొనుగోలు చేయనుందన్న వార్తలతో గురువారం ఆరంభంలోనే షేరు గ్యాప్‌అప్‌తో ఓపెనయింది. దీంతో ఆప్షన్‌ సెల్లర్లు తమ పొజిషన్లు కవర్‌ చేసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఫలితాలు వస్తున్నాయన్న నేపథ్యంలో మంగళవారం ఆర్‌ఐఎల్‌ 1360 స్ట్రైక్‌ ప్రైస్‌

విప్రో షేరును ఏం చేయొచ్చు?

Thursday 18th April 2019

క్యు4లో మంచి లాభాలు ప్రకటించిన విప్రోపై బ్రోకరేజ్‌లు మిశ్రమంగా ఉన్నాయి. 1. నోమురా: న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 270. క్యు4 ఫలితాల్లో  రెవెన్యూ గ్రోత్‌, మార్జిన్లు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. కానీ గ్రోత్‌ గైడెన్స్‌ అంచనాలు బలహీనంగా ఉన్నాయి. బైబ్యాక్‌ ముందు అనుకున్న విధంగానే ఉంది. కానీ గైడెన్స్‌ అంచనాలు భవిష్యత్‌ పేలవంగా ఉండొచ్చని సూచిస్తున్నాయి. 2. సిటీగ్రూప్‌: అమ్మొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 230. ఫలితాలు బాగున్నా, గైడెన్స్‌ నిరాశపరిచింది.

Most from this category