News


జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభం రూ.53.5 కోట్లు

Wednesday 13th September 2017
news_main1505241452.png-8461

ముంబై: దేశంలో రెండో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ జూన్‌ త్రైమాసికం స్టాండలోన్‌ లాభం రెట్టింపయ్యి రూ.53.5 కోట్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.25.9 కోట్లుగా ఉంది. 2014 నుంచి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టి, మార్కెట్‌ వృద్ధి మొదలైన తర్వాత వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ కంపెనీ లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.5,341 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.5,953 కోట్లకు చేరుకుంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం, ధరల్లో సగటు పెరుగుదల ఉండడం కలిసొచ్చింది. ఈ స్టాండలోన్‌ ఫలితాల్లో జెట్‌లైట్‌ విభాగం ఆదాయాలు కలవలేదు. ఒకవేళ జెట్‌లైట్‌ ఫలితాలను కూడా కలిపి చూస్తే నికర లాభం రూ.58 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది. కన్సాలిడేటెడ్‌ ఎబిటా మాత్రం రూ.1,027 కోట్ల నుంచి రూ.1,005 కోట్లకు తగ్గింది.







You may be interested

బకాయిల భారం తగ్గిన తర్వాతే విలీనాల పర్వం!

Wednesday 13th September 2017

 బ్యాంకింగ్‌పై రఘురామ్‌ రాజన్‌ సూచన న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో తొలుత మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తదుపరే విలీనాల ప్రక్రియ ప్రారంభం కావాలని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. బ్యాంకుల మూలధన సమస్య పరిష్కారానికి కూడా ఇది కీలకమని ఒక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు. ‘‘ముందు బ్యాంకింగ్‌ పటిష్టత దిశగా అడుగులు పడాలి. నిష్ణాతులైన వృత్తి నిపుణుతో బోర్డ్‌ క్రియాశీలం

ఐపీఓకు బంధన్‌ బ్యాంకు

Wednesday 13th September 2017

మర్చంట్‌ బ్యాంకర్ల నియామకం న్యూఢిల్లీ: కోల్‌కతా కేంద్రంగా నడుస్తున్న బంధన్‌ బ్యాంకు తన తొలి పబ్లిక్‌ ఇష్యూకు గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూపు, జేపీ మోర్గాన్‌ చేజ్‌, యాక్సిస్‌ బ్యాంకు, జేఎం ఫైనాన్షియల్‌, కోటక్‌ మహింద్రా బ్యాంకులను మర్చంట్‌ బ్యాంకర్లుగా నియమించినట్టు ప్రకటించింది. ‘‘షేర్ల విక్రయ పరిమాణం, ఐపీవో సమయం, ఇతర అంశాలేవీ ఇంకా ఖరారు కాలేదు. ప్రతిపాదిత ఐపీవోకు సంబంధించిన తుది నిర్ణయం నియంత్రణ సంస్థల ఆమోదానికి లోబడి ఉంటుంది’’ అని

Most from this category