News


2 శాతం పతనమైన ఐటీసీ

Wednesday 13th September 2017
Markets_main1505283077.png-8487

ముంబై:- ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 1శాతానికి పైగా నష్టపోయింది. ఐటీసీ సంస్థ హెల్త్‌కేర్ తో పాటు అగ్రి బిజినెస్‌ వంటి కొత్త వ్యాపార విభాగాల్లోకి ప్రవేశించనున్నట్లు సంస్థ ఈడీ, సీఈవో సంజీవ్ పురి చెప్పారు. ప్రధానంగా అగ్రి బిజినెస్‌పై దృష్టి సారిస్తూ ఉల్లి, బంగాళాదుంప వంటి కూరగాయలు మొదలైన వాటినీ విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఐటీసీ షేరు నేడు బీఎస్‌ఈ మార్కెట్‌ 1.80శాతం నష్టపోయి రూ.277.55ల కనిష్టస్థాయిని తాకింది. ప్రస్తుతం షేరు నిన్నటి ముగింపుధర(రూ.277.55)తో పోలిస్తే 1.66శాతం నష్టపోయి రూ.273ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.222.05లు, రూ.353.20లుగా ఉన్నాయి. టీసీ ఆదాయాల్లో ప్రస్తుతం 58 శాతం వాటా పొగాకుయేతర వ్యాపార విభాగాలైన ఎఫ్‌ఎ౾ంసీజీ, హోటల్‌, అగ్రి బిజినెస్‌, పేపర్ మొదలైన వాటిదే ఉంటోంది.







You may be interested

అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఎ బూస్ట్‌

Wednesday 13th September 2017

 హైదరాబాద్‌లోని యూనిట్‌4 కు వాలంటరీ యాక్షన్‌ ఇండికేటెడ్‌ సర్టిఫికేట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఎ  ఇచ్చినప్పటికీ  అరబిందో ఫార్మా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో కంపెనీ షేరు బుధవారం ఇంట్రాడేలో  2 శాతం పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ.766  వద్ద ట్రేడవుతోంది. కంపెనీ మానుఫాక్చరింగ్‌ విభాగంలో ఏడు లోపాలను హైదరాబాద్‌లోని యూనిట్‌4లో  యూఎస్‌ఎఫ్‌డీఎ గుర్తించింది. అయినప్పటికీ కంపెనీ షేరు పెరుగుతోంది. ఈ తనిఖీలను ఏప్రిల్‌ 20-28 తేదీలలో నిర్వహిం‍చింది.  యూఎస్‌ఎఫ్‌డీఎ ఫామ్‌ 483

3 నెలల గరిష్ట స్థాయికి టాటా పవర్‌ 

Wednesday 13th September 2017

టాటా గ్రూప్‌ కంపెనీ టాటా పవర్‌ కౌంటర్‌కు డి‍్మాం‍డ్‌ పెరిగింది.  ఇన్వెస్టర్లు కోనుగోళ్లకు ఆస‍క్తి చూపడంతో  కంపెనీ షేరు బుధవారం 6శాతం పెరిగి మూడు నెలల గరిష్టస్థాయిని తాకింది . ప్రస్తుతం షేరు ధర రూ.86.15 వద్ద ట్రేడవుతోంది.కాగా  కంపెనీ షేరు ఏడాది కనిష్టస్థాయి రూ. 67 , ఏడాది గరిష్టస్థాయి రూ.91.15 గా నమోదయ్యాయి.టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌  ప్రధానంగా ట్రాన్సిమిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ కమ్‌ రిటైల్‌, పవర్‌ సర్వీసెస్‌,

Most from this category