News


ఆశాజనకంగా ఐటీ రంగం: ఐఐఎఫ్‌ఎల్‌

Saturday 5th May 2018
Markets_main1525518550.png-16191

ముంబై: హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ షేరు ధర శుక్రవారం ట్రేడింగ్‌లో 15 శాతం వరకు పడిపోయిన ప్రతికూల అంశం కారణంగా మిడ్‌క్యాపీ ఐటీ సూచీ మరింత బలహీనపడి ఇంట్రాడేలో 10 శాతం నష్టాలను నమోదుచేసిందని వెల్లడించిన బ్రోకింగ్‌ సంస్థలు వచ్చే రెండు ఏళ్లలో ఐటీ రంగం వృద్ధి బాటలో ప్రయాణం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఐటీ కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీపై దృష్టిసారించడం.. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా రంగ సేవలలో వ్యయాలను పెంచడం ఆధారంగా చూస్తే పతనం తాత్కాలికమే అని విశ్లేషించిన  మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ విశ్లేషకులు ఆశిష్‌ చోప్రా.. నెమ్మదిగా ఐటీ రంగం కోలుకుంటుందని తాను భావిస్తున్నట్లు వివరించారు. అయితే, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ మాత్రం సవాళ్లను ఎదుర్కునేందుకు అవకాశం ఎ‍క్కువగా ఉందని వివరించారు. 2018-20 కాలంలో ఐటీ రంగం ఆశాజనకంగా ఉంటుందని ఇండియా ఇన్‌ఫోలైన్‌ విశ్లేషకులు మిలన్ దేశాయ్ అన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనపడడం ఈ రంగానికి కలిసివచ్చే అంశంగా విశ్లేషించిన ఆయన త్వరలోనే ఐటీ రంగం రెండెంకల వృద్ధిరేటును నమోదుచేస్తుందని అంచనావేశారు. దిగ్గజ ఐటీ కంపెనీలు ఇప్పటికే "వీ షేప్‌" ఎర్నింగ్స్‌ రికవరీ దశకు చేరుకున్నాయని వివరించిన ఎడెల్వీస్ సెక్యూరిటీస్ అనలిస్ట్‌ సందీప్ అగర్వాల్.. త్వరలోనే ఈ రంగ వృద్ధిరేటు ఆశాజనకంగా మారనుందన్నారు. గడిచిన ఏడాదికాలంలో సెన్సెక్స్‌ 16 శాతం పెరుగగా.. బీఎస్‌ఈ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇండెక్స్ ఏకంగా 32 శాతం పెరిగిందన్నారు. మజేస్కో, ఇంటలెక్ట్ డిజైన్, న్యూక్లియస్, ఒరాకిల్ ఫైనాన్షియల్స్, రామ్‌కో సిస్టమ్స్ తమకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని ఎమ్‌కే గ్లోబల్‌ రాహుల్‌ జైన్‌ అన్నారు. You may be interested

జైడస్‌కు ఔషధాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి

Saturday 5th May 2018

ముంబై:- జైడస్‌ క్యాడిల్లా అభివృద్ధి చేసిన రెండు ఔషధాలకు అమెరికా, ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీ)నుంచి అనుమతులు లభించాయి. సుకినిలో కోలిన్ క్లోరైడ్, ప్లారిక్సాఫోర్ ఔషధాల తయారీతో పాటు అమెరికా మార్కెట్లో విక్రయించే యూఎస్‌ఎఫ్‌డీఏ అనుతులు తెలిపినట్లు జైడస్‌ క్యాడిల్లా శనివారం స్టాక్స్‌ఎక్చే‍‍్సంజ్‌ సమాచారం ఇచ్చింది. శ్వాస నాళ, అస్థి కండరపు శస్త్రచికిత్స సమయాలో రోగికి ఇచ్చే అనస్థిసియా(మత్తు మందు)తో సుకినిలో కోలిన్ క్లోరైడ్ ఔషధాన్ని వాడతారు. ప్లారిక్సాఫోర్‌ ఔషధానికి

3 షేర్లు.. 20 శాతం రాబడి..!

Saturday 5th May 2018

ముంబై: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే మార్కెట్‌ దిశ ఆధారపడి ఉందని ఈక్విటీ 99డాట్‌కామ్‌ ఫౌండర్ సుమిత్ బిల్గాయన్ అన్నారు. వచ్చే వారంలో అయితే ఎగ్జిట్‌ పోల్స్‌, అంతర్జాతీయ అంశాలు, పలు కంపెనీల గత ఆర్థిక సంవత్సరానికి చెందిన చివరి క్వార్టర్‌(మార్చి క్వార్టర్‌–క్యూ4) ఫలితాలపైనే నిఫ్టీ గమనం ఉంటుందని అన్నారు. గడిచిన వారంలో నిఫ్టీ వరుసగా 10,650 స్థాయిని.. ఆ తరువాత 10,620 స్థాయిని కూడా కోల్పోయిన నేపథ్యంలో వచ్చే

Most from this category