STOCKS

News


ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఫలించేనా..?

Saturday 8th July 2017
Markets_main1499498959.png-5047

ముంబై: దేశంలోని ఇల్లు లేని పేదలకు ఆశాదీపంలా కనిపిస్తోన్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏఐ) పథకం అనుకున్న స్థాయిలో ఫలితాలు అందిస్తుందా..? అసలు ఈ పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తుందా అనే అంశంపై జేఎం ఫైనాన్షియల్‌ సంస్థ ఒక రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం  జూలై 6, 2017 నాటికి పిఎంఏఐ పథకం కింద సుమారు 55,000 నూతన గృహాల నిర్మాణం పూర్తయ్యింది. మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా తుది నిర్మాణదశకు చేరుకున్నాయి. అయితే, ఈ పథకం కింద నిర్మాణ సమయం మాత్రం బాగా ఎక్కువైపోయిందనే విషయం పలు రాష్ట్రాలలోని పూర్తయిన ఇళ్ల జాబితా ద్వారా వెల్లడవుతోంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలలో 4 నుంచి 8 నెలల్లో నిర్మాణం పూర్తవ్వాలని లక్ష్య నిర్థేశ్యం ఉండగా.. ఈ ప్రాంతాలలో కనీసం ఏడాది నుంచి ఏకంగా 3 ఏళ్ల సమయం పడుతోంది. పరిస్థితి ఈ విధంగా ఉంటే, ప్రభుత్వం మాత్రం పిఎంఏఐ పథకం ఆధారంగా మార్చి 2018 నాటికి దేశవ్యాప్తంగా 51 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిజానికి ఏడాది మొత్తం మీద సగటున 20 లక్షల నుంచి 30 లక్షల ఇళ్ల నిర్మాణమే జరుగుతుండగా, ప్రభుత్వ నిర్థేశిత లక్ష్యం ఎక్కువగానే ఉందని జేఎం ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌లో వ్యక్తమవుతోంది. రాష్ట్రాల పరంగా చూస్తే మధ్యప్రదేశ్‌ లాంటి ప్రాంతాలకు ఏకంగా 90 శాతం నిధుల కేటాయింపులు జరిగి ఈ పథకం సూపర్‌ హిట్‌ అనేలా ఉండగా.. కేరళ లాంటి ప్రాంతాలు అసలు ఈ పథకం ద్వారా పేదలందరికీ ఇళ్లు దక్కేనా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

జేఎం ఫైనాన్షియల్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ పూర్తి వివరాలు కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1499499990Pradhan Mantri Awas Yojana.pdf)

You may be interested

డెరివేటివ్స్‌పై పి - నోట్ల జారీని నిషేధించిన సెబి

Saturday 8th July 2017

ముంబై:- విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) డెరివేటివ్స్‌పై పార్టిసిపేటరీ నోట్స్ (పి-నోట్లు)జారీ చేయడాన్ని సెబీ నిషేధించింది.  అయితే హెడ్జింగ్‌కోసం తీసుకున్న డెరివేటివ్స్‌పై పీ-నోట్లు జారీ చేయడానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. అలాంటి డెరివేషన్స్‌కు సంబంధించిన షేర్లను ఎఫ్‌పీఐలు తమ వద్ద ఉంచుకోవాలని సెబీ విడుదల చేసిన ఆదేశాలు వెల్లడిస్తు‍న్నాయి. ఇతర ప్రయోజనాల కోసం జారీ చేసిన పీనోట్లను లిక్విడేట్‌ చేయాల్సిఉంటుంది. హెడ్జింగ్‌లో లేని పి-నోట్ల డెరివేటివ్స్‌ పొజిషన్ల నుంచి గడువు పూర్తయిన(మెచ్యూరిటి) తేది లేదా 2020

బ్యాంకింగ్‌ షేర్లలో ఏవి కొనాలి..? ఏవి అమ్మాలి..?

Saturday 8th July 2017

ముంబై: బ్యాంకింగ్‌ రంగ పనితీరు.. ఈ రంగంలో ఏ షేర్లను కొనాలి, ఇంకే షేర్లను అమ్మివేయాలి అన్న అంశంపై జేఎం ఫైనాన్షియల్‌ ఒక రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ రీసెర్చ్‌ సంస్థ రిపోర్ట్‌ ఆధారంగా 2017-18 మొదటి త్రైమాసికంలో బ్యాంకింగ్‌ రంగ పనితీరు ఇంతకుముందు క్వార్టర్ల మాదిరిగానే పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే.. నికర లాభం 23 శాతంగా (ప్రైవేట్‌ బ్యాంకులు 11 శాతం,

Most from this category