STOCKS

News


ఇంటికి బీమా రక్షణ తీసుకున్నారా?

Wednesday 13th September 2017
personal-finance_main1505289099.png-8495

ఇంట్లోని వారికే కాదు, ఇంటికీ బీమా రక్షణ అవసరమే. ఈ మధ్య కాలంలో ఈ విషయమై వినియోగదారుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పాలసీ తీసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల గురించి నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి. 


హోమ్‌ ఇన్సూరెన్స్‌ బేసిక్‌ పాలసీ అన్నది అగ్ని ప్రమాదాల వల్ల ఇంటికి, ఇంట్లోని విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. అలాగే, విపత్తులైన పిడుగు, తుఫానులు, వరదల వల్ల వాటిల్లే నష్టానికీ పరిహారం చెల్లిస్తుంది. అదే హౌస్‌ హోల్డర్స్‌ పాలసీ (హెచ్‌పీపీ) మాత్రం అగ్ని ప్రమాదాల నుంచి రక్షణతోపాటు మరెన్నో ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో ఇంట్లో దోపిడీ జరిగి ఏవైనా వస్తువులను కోల్పోయినా, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ తదితర కారణాల వల్ల వస్తువులకు నష్టం వాటిల్లినా పరిహారం లభిస్తుంది. 

 

మార్కెట్ వ్యాల్యూ, రీఇన్స్ స్టేట్ వ్యాల్యూ
బీమాకు సంబంధించి మీ ఇంటి విలువ లెక్కింపులో మూడు అంశాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భూమి విలువ, నిర్మాణ వ్యయం, ఇల్లు ఉన్న లొకాలిటీ (ఖరీదైన ప్రాంతంలో ఉంటే ఆ ఇల్లు విలువ పెరుగుతుంది) ఖరీదు. అయితే, ఇందులో బీమా నిర్మాణ వ్యయానికే పరిమితం అవుతుంది. ఇంటికి సంబంధించి బీమా ఎంతన్నది సాధారణంగా రెండు రకాలుగా నిర్ణయించడం జరుగుతుంది. మార్కెట్ విలువ ఆధారంగా లేదా తరుగుదలను తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని పరిగణనలోకి తీసుకోవడం. రెండోది రీఇన్ స్టేట్ మెంట్ విధానం. బీమాలో మార్కెట్ విలువ అంటే మీ ఇంటి నిర్మాణ వ్యయంలోంచి తరుగుదలను తీసేయగా వచ్చేది. అదే రీఇన్ స్టేట్ మెంట్ అంటే ఓ ఇంటి నిర్మాణ పూర్తి విలువ.  ఇందులో తరుగుదలను తీసేయడం ఉండదు. కనుక ఈ పాలసీలు తీసుకోవడం ప్రయోజనం. అందుకే పాలసీ తీసుకునే ముందు ఏదన్నది పరిశీలించాలి.

 

అండర్ ఇన్సూరెన్స్
అండర్ ఇన్సూరెన్స్ అంటే ఇంటి నిర్మాణ వ్యయం చరదపు అడుగుకు రూ.2,000 అయిందనుకోండి. మీరు కేవలం చదరపు అడుగుకు రూ.1,000కే ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకుంటే దీన్ని బీమా సంస్థ అండర్ ఇన్సూరెన్స్ గా పరిగణిస్తుంది. క్లెయిమ్ సమయంలో బీమా సంస్థ సగమే చెల్లిస్తుంది. రీఇన్ స్టేట్ మెంట్ ఇన్సూరెన్స్ పాలసీలో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే ఇంటికి నష్టం జరిగినప్పుడు తిరిగి ఇల్లు నిర్మాణం జరిగిన తర్వాతే బీమా సంస్థ పరిహారం చెల్లిస్తుంది. లేదంటే ఇంటి నిర్మాణం కోసం గాను పాక్షిక చెల్లింపులు మాత్రమే చేస్తుంది. ఒకవేళ అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో ఉంటుంటే ఇంటిని తిరిగి నిర్మించేందుకు ఇతరుల ఆమోదం కోసం వేచి ఉండాల్సి రావచ్చు. ఈ తరహా అవసరాల నేపథ్యంలో బీమా సంస్థలు అగ్రీడ్ వ్యాల్యూ ఆధారంగా హోమ్ ఇన్సూరెన్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. ఈవిధానంలో ఇంటికి నష్టం జరిగితే అగ్రీడ్ వ్యాల్యూ పాలసీదారుడికి వెళుతుంది. ఇల్లు బీమా సంస్థ చేతికి వెళుతుంది. అంటే రీ ఇన్ స్టేట్ మెంట్ విధానంలో మాదిరిగా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అగ్రీడ్ వ్యాల్యూ తీసేసుకుని కొత్త ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు. You may be interested

1980లో యుఎస్‌ఎ, 90ల్లో చైనా, ఇప్పుడు మనం...

Wednesday 13th September 2017

వృద్ధి పరుగులకు సిద్ధంగా ఉన్న భారత్‌ స్టాక్ మార్కెట్ల ర్యాలీ మోదీ సర్కారు సంస్కరణలు, అంతర్జాతీయంగా లిక్విడిటీ ఇలా ఎన్నో అంశాల మేళవింపు కావచ్చు. మరి నిఫ్టీ 10,000 తర్వాత ఏంటి పరిస్థితి..? ఇప్పటికీ మన మార్కెట్లు ఈ దశలో పెట్టుబడి పెట్టేందుకు అనువైన స్థితిలోనే ఉన్నాయా? సంపద సృష్టికి ఇవి ఇప్పటికీ అనుకూల వేదికలేనా..? దీనిపై యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో అరుణ్‌తుక్రాల్‌ విశ్లేషణ ఇలా ఉంది. మన దేశ ఆర్థిక

ఇ- వాహనాలతో ఈ షేర్లకు వెలుగులు..!

Wednesday 13th September 2017

ముంబై: విద్యుత్తు వాహనాల దిశగా దేశం అడుగులు వేస్తోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మనదేశం సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహన తయారీని పక్కన పెట్టి, ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ ఈ రంగాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. పెట్రోలు, డీజిల్ దిగుమ‌తుల‌ భారాన్ని తగ్గించడంలో భాగంగా 2030 నాటికి వీటి ఆధారంగా నడిచే వాహనాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని

Most from this category