News


ఇండియాబుల్స్ ఫండ్‌లో ఇన్‌స్టంట్ యాక్సెస్ సదుపాయం

Sunday 16th July 2017
personal-finance_main1500199418.png-5471

ఇండియాబుల్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తమ లిక్విడ్ ఫండ్‌లో ఇన్‌స్టంట్ యాక్సెస్ సదుపాయం ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లు సత్వరం తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారాంతాలైనా, బ్యాంకు సెలవుదినాలైనా, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా మూడొందల అరవై అయిదు రోజులు, ఇరవై నాలుగ్గంటలూ రిడెంప్షన్ (యూనిట్లు విక్రయించుకోవడం) అవకాశం కల్పిస్తున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అక్షయ్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం దీన్ని దేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఎన్నారై, కార్పొరేట్లకు వర్తించదు. రిడెంప్షన్ అనంతరం నిమిషాల వ్యవధిలోనే సదరు మొత్తం ఐఎంపీఎస్ (ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్) విధానంలో ఇన్వెస్టరు బ్యాంకు ఖాతాలో జమవుతుందని గుప్తా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు గరిష్టంగా రూ. 50,000 దాకా లేదా తమ పోర్ట్‌ఫోలియో విలువలో 90 శాతం దాకా (ఏది తక్కువైతే అది) రిడీమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు







You may be interested

బజాజ్ అలయంజ్ లైఫ్ నుంచి ఫ్యూచర్ వెల్త్ గెయిన్‌ పాలసీ

Sunday 16th July 2017

ప్రైవేట్ బీమా దిగ్గజ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా బజాజ్ అలయింజ్‌ లైఫ్ ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పథకంలో 'వెల్త్ ప్లస్', 'వెల్త్ ప్లస్ కేర్'  పేరిట రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకవైపు పాలసీదారు కుటుంబానికి బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా సంపదను మరింతగా పెంచగలిగే విధంగాఈ పథకాన్ని రూపొందించారు. పాలసీదారు

వాయిదా వేయకండి..

Sunday 16th July 2017

నష్టపోవడమంటే ఎవరికి ఇష్టముంటుంది చెప్పండి. ఇన్వెస్టర్లు కూడా అందరిలాగే. అయితే వీరికెప్పుడూ అధిక రాబడులపైనే కన్నుంటుంది. అందుకే వీరు అక్కడ నష్టాలున్నాయని తెలిసినా కూడా లాభాల కోసం అందుబాటులోని అవకాశాలను వెతుక్కుంటారు. అయితే ఇక్కడ నష్టాలకు భయపడేవారూ కొందరుంటారు. వీరు నష్టాలకు భయపడి వారి పెట్టుబడులను వాయిదా వేసుకుంటుంటారు. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్లకు అనువైన అవకాశం కోసం వేచిచూడటం ఎలా ఉంటుందంటే.. పంట వేయడం కోసం

Most from this category