STOCKS

News


ఎస్సార్ స్టీల్ కొనుగోలు రేసులో ఆర్సెలర్‌మిట్టల్‌

Monday 12th February 2018
news_main1518459788.png-13915

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్‌ను దక్కించుకునేందుకు అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్ కూడా బరిలోకి దిగింది. ఆర్సెలర్‌మిట్టల్ అనుబంధ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ ఇండియా (ఏఎంఐపీఎల్‌) ఇందుకోసం సోమవారం బిడ్ దాఖలు చేసింది. ఎస్సార్ పనితీరు, లాభదాయకతను మెరుగుపర్చేందుకు తీసుకోబోయే ప్రణాళికను ఇందులో వివరించినట్లు ఆర్సెలర్‌మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపింది. సాంకేతికాంశాల్లోనూ అంతర్జాతీయంగా తమకు ఉన్న అనుభవం.. ఎస్సార్‌ స్టీల్‌కు ఉపయోగకరంగా ఉండగలదని పేర్కొంది. మరోవైపు, గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో ప్రవేశించేందుకు ఎస్సార్‌ కొనుగోలు కూడా తమకు తోడ్పడగలదని ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ పేర్కొన్నారు. You may be interested

జీఐసీ రీ లాభం రూ.673 కోట్లు

Monday 12th February 2018

గత క్యూ3లో రూ.401 కోట్ల నికర నష్టాలు  ముంబై: ప్రభుత్వ రంగ రీ ఇన్సూరెన్స్‌ దిగ్గజం జీఐసీ రి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.673 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.401 కోట్ల నికర నష్టాలు వచ్చాయని జీఐసీ రీ తెలిపింది. గత క్యూ3లో 105.9 శాతంగా ఉన్న కంబైన్డ్‌ రేషియో ఈ క్యూ3లో 101.1 శాతం సాధించడం, వాహన, సముద్ర, అగ్ని

ఆర్థిక గణాంకాల ఊరట!

Monday 12th February 2018

 డిసెంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 7.1 శాతం  జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.07 శాతం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ), రిటైల్‌ ద్రవ్యోల్బణం అంశాలకు సంబంధించి సోమవారంనాడు విడుదలైన తాజా గణాంకాలు కొంత ఊరటనిచ్చాయి. తయారీ రంగం ఊతంతో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2017 డిసెంబర్‌లో 7.1 శాతంగా ఉంది. 2016 డిసెంబర్‌లో ఈ రేటు 2.4 శాతం. అయితే నవంబర్‌ 2017తో (8.8 శాతం) పోల్చితే మాత్రం ఐఐపీ

Most from this category