STOCKS

News


ఇన్ఫోసిస్‌కు ఫలితాల షాక్‌..!

Monday 16th April 2018
Markets_main1523873726.png-15544

6 శాతం నష్టషోయిన షేర్లు
నిమిషాల్లో రూ.15 వేల కోట్ల నష్టం
ముంబై:- విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా త్రైమాసిక ఫలితాలను సాధించినప్పటికీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు సోమవారం మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నేడు బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలో 6 శాతం నష్టపోయి రూ. 1099.00 ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. గత శుక్రవారం క్రితం ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉన్నప్పటికీ వృద్ధి రేటు, ఆపరేటింగ్ మార్జిన్ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభం‍లోనే ఇన్ఫోసిస్‌ షేర్లు  భారీగా పతనమయ్యాయి. షేర్ల ఏకంగా 6 శాతం పతనమవడంతో ఇన్ఫీ మార్కెట్‌క్యాప్‌ రీత్యా నిమిషాల వ్యవధిలో రూ.15 వేల కోట్లు నష్టపోయింది. మధ్యాహ్నాం గం.2:35 ని.లకు గత ముగింపు ధర(రూ.1169)తో పోలిస్తే 3శాతానికి పైగా నష్టపోయి రూ.1128.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.861.50 రూ.1220.00లుగా నమోదయ్యాయి. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ రూ.3690 కోట్ల నికర లాభాన్ని చూపించింది.



You may be interested

ఈ 30 స్టాకులను దిగ్గజాలు రికమండ్‌ చేస్తున్నాయ్‌!

Monday 16th April 2018

దేశీయ మార్కెట్లు క్రమంగా గత రెండు నెలల గాయాలను మరిచి ముందుకు సాగేయత్నంలో ఉన్నాయి. నిఫ్టీ ప్రస్తుతం కీలక మద్దతు స్థాయిలకు పైనే ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు వర్దమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే మంచి ప్రదర్శనే చూపుతాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ చెబుతోంది. ఏడాది చివరకు సెన్సెక్స్‌ 41,500పాయింట్లను తాకవచ్చని(బుల్‌రన్‌ కొనసాగితే) పేర్కొంది.(బేర్‌ కేస్‌లో 25వేల పాయింట్లకు దిగజారవచ్చని తెలిపింది.) ప్రస్తుతం మిడ్‌క్యాప్స్‌ కన్నా

డాషింగ్‌ డజన్‌ రికమండేషన్లు..

Monday 16th April 2018

వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వచ్చే మూడు వారాల కోసం 12 స్టాకులను సిఫార్సు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు 1. సూర్యరోష్ని: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 450. స్టాప్‌లాస్‌ రూ. 405. శుక్రవారం బుల్లిష్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. అధోముఖ వాలు రేఖను పైవైపుగా ఛేదించి క్లోజయింది. ప్రస్తుతం 20, 50, 100, 200 రోజుల డీఎంఏ స్థాయిలకన్నా పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా ఉంది. ఇండికేటర్లు సైతం స్టాకులో బలాన్ని సూచిస్తున్నాయి. 2. జీనస్‌ పవర్‌:

Most from this category