STOCKS

News


ట్రేడ్‌ ఫైనాన్స్‌ కోసం ఇన్ఫీ బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌

Wednesday 16th May 2018
news_main1526489036.png-16525

న్యూఢిల్లీ: ట్రేడ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాల్లో బ్యాంకులకు తోడ్పడేలా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా ఫినకిల్ ట్రేడ్ కనెక్ట్ పేరిట బ్లాక్‌ చెయిన్ ఆధారిత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. దీనికోసం యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌, ఆర్‌బీఎల్‌, కోటక్ మహీంద్రా, సౌత్ ఇండియా బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌లతో చేతులు కలిపింది. ట్రేడ్ ఫైనాన్స్ వ్యాపార ప్రక్రియలను డిజిటైజ్ చేయడం, చెల్లింపులు జరపడం మొదలైన వాటికి ఈ నెట్‌వర్క్ ఉపయోగపడుతుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఆటోమేషన్‌.. పారదర్శకత పెరగడం వల్ల రిస్కులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని వివరించింది. 
 



You may be interested

ముత్తూట్ ఫైనాన్స్‌ లాభం రూ. 451 కోట్లు

Wednesday 16th May 2018

న్యూఢిల్లీ: రుణాల పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పుల చేసిన నేపథ్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4లో ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం 40 శాతం ఎగిసి రూ. 451 కోట్లుగా నమోదైంది. 2016-17 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 322 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం రూ. 1,573 కోట్ల నుంచి రూ. 1,710 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 1,180 కోట్ల నుంచి

హైదరాబాద్‌లో నెస్‌, ఎస్‌అండ్‌పీ ఇన్నోవేషన్‌ సెంటర్‌

Wednesday 16th May 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవల్లో ఉన్న నెస్‌ డిజిటల్‌ ఇంజనీరింగ్‌ హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ సెంటర్‌ను నెలకొల్పింది. రేటింగ్స్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్టు బుధవారమిక్కడ ప్రకటించింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 850 మంది కూర్చునే వీలుగా దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 375 మంది పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది పూర్తి సామర్థ్యానికి చేరుకుంటుంది. వివిధ దేశాల్లో 16 ఇన్నోవేషన్‌ కేంద్రాలు ఉన్నాయని,

Most from this category