STOCKS

News


ఐపీఓకు ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌..!

Tuesday 13th February 2018
Markets_main1518516382.png-13927

న్యూడిల్లీ:- బ్యాంకింగేతర రంగంలో సేవలు అందిస్తున్న ఇండోస్టార్‌ క్యాపిటల్‌ తొలిసారి తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సిద్ధమైంది.ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2వేల కోట్లు సేకరించనుంది. ఈ మేరకు ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.  ఇష్యూలో భాగంగా కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.700 కోట్లను, వాటాదారులకు చెందిన 2 కోట్ల షేర్ల విక్రయం ద్వారా మిగతా మొత్తాన్ని సమీకరించనుంది. ఈ ఐపీఓకు జేఎమ్‌ ఫైనాన్షియల్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా, మోతీలాల్‌ ఓస్వాల్‌ కంపెనీ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఐపీఓ ప్రక్రియపై సంబంధిత అధికారులు స్పందిస్తూ‘‘ ఐపీఓ ద్వారా తమ బ్రాండ్‌ విలువ పెరగడమే కాకుండా, ఈక్విటీ షేర్లకు పబ్లిక్‌ మార్కెట్‌ లభిస్తుంది. సమీకరించిన నిధులను మూలధన పెట్టుబడికి, కార్పోరేట్‌ అవసరాలకు వినియోగిస్తాం’’అని తెలిపారు. ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ప్రధానంగా కార్పోరేట్‌, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రుణాలిస్తోంది. ప్రస్తుతం ఎవర్‌స్టోన్‌ క్యాపిటల్‌, బీకాన్‌ ఇండియా ఫండ్‌, ఏసీపీఐ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, సీఐడీబీ క్యాపిట్‌ సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి.You may be interested

10025 పాయింట్లే చివరి ఆశ!

Tuesday 13th February 2018

నిఫ్టీపై పట్టుకు బుల్స్‌కు ఇదే గట్టి మద్దతు రెండువారాలుగా అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న కరెక‌్షన్‌ దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలవుతున్నారు. నిజానికి ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్‌ కాస్తమేర నయమనిపించేలా ఉంది. నిఫ్టీ ఆల్‌టైమ్‌ హై నుంచి దాదాపు 6 శాతం పతనమైంది. బడ్జెట్‌ నుంచి కేవలం డీఐఐలు మాత్రమే నికర కొనుగోలుదారులుగా మారాయి. ఎఫ్‌ఐఐలు, రిటైలర్లు నికరంగా అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే తిరిగి మార్కెట్‌పై

మార్చికల్లా మరో పతనం....

Tuesday 13th February 2018

అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్‌ అంచనా మార్చికల్లా ప్రపంచ మార్కెట్లలో మరో పతనం సంభవిస్తుందని అంతర్జాతీయ ఫండ్‌..ఏఎంపీ క్యాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ మేనేజర్‌ నాదెర్‌ నయేమి అంచనావేస్తున్నారు. 120 బిలియన్‌ డాలర్ల ఆస్తుల్ని నిర్వహిస్తున్న ఈ ఫండ్‌...పెద్ద ఎత్తున నగదు నిల్వల్ని అట్టిపెట్టింది. ఫిబ్రవరి తొలివారంలో జరిగిన పతనం తర్వాత..రాబోయే రెండో పతనంలో ఈ నిల్వలతో పెట్టుబడులు చేయాలని యోచిస్తున్నట్లు నయేమి బ్లూమ్‌బర్గ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి పతనం తర్వాత...మలి పతనం

Most from this category