News


రేడియోను వెనక్కినెట్టేసిన మొబైల్‌!

Tuesday 18th July 2017
news_main1500322117.png-5540

  •  2021 నాటికి మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ 34.8 బిలియన్‌ డాలర్లకు
  •  మొత్తం ప్రకటనల వ్యయంలో టీవీ, ప్రింట్‌ వాటానే 76.2 శాతం
  •  గతేడాది మూడో స్థానంలో రేడియో; ప్రస్తుతం ఈ స్థానంలో మొబైల్‌


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2021 నాటికి దేశీయ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ ఏటా 11.8 శాతం వృద్ధితో 34.8 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 నాటికి అన్ని విభాగాల్లో కలిపి ప్రకటనల వ్యయం 16.7 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఈవై విడుదల చేసిన ‘‘మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌: డిజిటల్‌ పాయింట్‌’’ సర్వేలో వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అడ్వటైజింగ్‌ వేదికల్లో ఎప్పటిలాగే టెలివిజన్‌ (టీవీ), ప్రింట్‌ మాద్యమాలు తొలి రెండు స్థానాలో నిలవగా.. గతేడాది మూడో స్థానంలో నిలిచిన రేడియోను ఈ ఏడాది మొబైల్‌ ఆక్రమించేసిందని నివేదిక పేర్కొంది. 2016–21 మధ్య కాలంలో డిజిటల్‌ అడ్వటైజింగ్‌ ఏటా 26 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. అలాగే రేడియో 16 శాతం, టెలివిజన్‌ 11 శాతం, ప్రింట్‌ మీడియా 7 శాతం నమోదు చేస్తుందని కూడా వివరించింది. 
2016లో పరిశ్రమ ఎంతంటే?
2016లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం ప్రకటనల వ్యయం 8.18 బిలియన్‌ డాలర్లు. ఇందులో కేవలం టెలివిజన్, ప్రింట్‌ మాధ్యమాల అడ్వటైజింగ్‌ వాటానే 76.2 శాతం. ప్రస్తుతం టెలివిజన్‌ అడ్వటైజింగ్‌ విభాగానిదే అగ్రస్థానం. మొత్తం ప్రకటనల వ్యయంలో టీవీ విభాగం వాటానే 46 శాతం. ప్రింట్‌ విభాగం 23 శాతం, డిజిటల్‌ 6 శాతంగా ఉన్నాయి. 2016లో సబ్‌స్క్రిప్షన్‌ మార్కెట్‌ వాటా 9.3 బిలియన్‌ డాలర్లుగా నమోదు చేసింది. 2020 నాటికీ విభాగం 15 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. 2013లో దేశీయ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో 0.46 మిలియన్ల మంది ఉద్యోగులుండగా.. 2017 నాటికి ఏటా 13 శాతం వృద్ధితో 0.75 మిలియన్లకు చేరింది.







You may be interested

మార్కెట్‌ కొంపముంచిన ఐటీసీ!

Tuesday 18th July 2017

ముంబై: బుల్‌ జోరుకు కళ్లెం పడింది. వరుస రికార్డుస్థాయి లాభాలను నమోదుచేస్తు దూసుకెళ్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు మంగళవారం ఐటీసీ షాక్‌ తగిలింది. సిగరెట్‌లపై జీఎస్‌టీ కౌన్సిల్‌ సెస్‌ విధించిన నేపథ్యంలో ఐటీసీ షేరు ఏకంగా 13 శాతం క్షీణించింది. ఇండెక్స్‌లోని ఈ హెవీవెయిట్‌లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్‌ గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యింది. దీంతో ఆరంభంలోనే 400 పాయింట్లు కోల్పోయింది. సోమవారం 32,074 పాయింట్ల రికార్డుస్థాయి క్లోజింగ్‌ని నమోదుచేసిన

ఐపీవో యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా ఐపీవోకి రావాలని నిర్ణయించింది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతి ఇంకా రాకపోవడంతో మ్యాక్స్ లైఫ్‌తో విలీన ప్రతిపాదనను ప్రస్తుతం పక్కకు పెట్టాలని భావిస్తోంది. సోమవారం సమావేశమైన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ బోర్డు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పెయిడప్‌ క్యాపిటల్‌లో గరిష్టంగా 20 శాతం వాటాలను ఆఫర్‌ ఫర్ సేల్ రూపంలో ఐపీవో కింద విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు కంపెనీ

Most from this category