STOCKS

News


ఊహించినదానికన్నా అధికంగా వృద్ధి వేగం!

Tuesday 13th March 2018
news_main1520960269.png-14632

  •  2018లో భారత్ వృద్ధి తీరుపై డెలాయిట్‌ విశ్లేషణ

న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి వేగం 2018లో ఊహించినదానికన్నా వేగంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ- డెలాయిట్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. గ్రామీణ డిమాండ్‌ పునరుద్ధరణ, మౌలిక రంగంలో వ్యయాల పెంపు వంటి అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది. రుణ ఇబ్బందులు పెరిగినా, అమెరికా వంటి దేశాలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు అనుసరించినా భారత్‌ వృద్ధి వేగవంతంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని డెలాయిట్‌ వ్యక్తం చేసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, అలాగే మార్కెట్లలలో ఒడిదుడుకులు కూడా వృద్ధి పురోగతిపై ప్రభావం చూపబోవని అభిప్రాయపడింది.  ‘వాయిస్‌ ఆఫ్‌ ఆసియా’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...

♦ దేశీయ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇది వృద్ధి ఊపందుకోడానికి దోహదపడే అంశం. 
♦ వృద్ధి రికవరీ బాగుంది. అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో 7.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్టస్థాయి. వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు బాగున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. 
♦ డీమోనిటైజేషన్‌, జీఎస్‌టీ ప్రారంభ కష్టాలు వంటి అంశాలు వృద్ధిని బలహీనపరిచాయి. అయితే ఆయా సమస్యలు ప్రస్తుతం తొలగిపోతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిని సరైన దిశకు నడిపిస్తున్నాయి. 
♦ భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2017 మూడవ త్రైమాసికంలో వృద్ధి బాగుంది. 2018లో కూడా4 వృద్ధి పురోగతి కొనసాగే వీలుంది. 6.8 శాతం నంచి 6.9 శాతం శ్రేణిలో వృద్ధి నమోదయ్యే వీలుంది. 
♦ దేశీయ డిమాండ్‌ బాగుంది. వినియోగం పెరుగుతోంది. చిన్న తరహా పరిశ్రమలు పుంజుకుంటున్నాయి. 
♦ అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్‌ ఇండియా పటిష్టతకు కృషి వృద్ధికి దోహదపడే అంశాలు.

అంతర్జాతీయ వృద్ధి 3.7 శాతం
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 75 శాతానికిపైగా పురోగమన దశలో ఉంది. 2017లో 3.6 శాతం వృద్ధి నమోదయితే, 2018లో ఇది 3.7 శాతానికి చేరే అవకాశం ఉంది. 2016లో ఈ రేటు 3.2 శాతం. అంతర్జాతీయ వృద్ధి సానుకూల అంశాలు భారత్‌కు కలిసి వస్తాయని డెలాయిట్‌ భావిస్తోంది. You may be interested

ఎల్‌వోయూల జారీపై నిషేధం

Tuesday 13th March 2018

 ఆర్‌బీఐ ఆదేశం  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ స్కామ్ ప్రభావం ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) కుంభకోణం దరిమిలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఎల్‌వోయూలు జారీ చేయడాన్ని నిషేధించింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్‌వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్‌ (ఎల్‌వోసీ)ల జారీ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వివరించింది.

ఎగవేతదారుల ఫోటోలను బయటపెట్టండి

Tuesday 13th March 2018

బ్యాంకులను కోరిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు పెరుగుతుండడంతో వాటికి కళ్లెం వేసే దిశగా సంబంధిత ఖాతాదారుల ఫోటోలను పత్రికల్లో ప్రచురించడం ద్వారా దారికి వచ్చేలా చేయాలని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ‘నేమ్‌ అండ్‌ షేమ్‌’ కార్యక్రమం కింద ఎగవేతదారుల ఫోటోలను ప్రచురించేందుకు బోర్డుల అనుమతి తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖలో సూచించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

Most from this category