News


బ్యాంకింగ్‌ షేర్లలో ఏవి కొనాలి..? ఏవి అమ్మాలి..?

Saturday 8th July 2017
Markets_main1499497476.png-5046

ముంబై: బ్యాంకింగ్‌ రంగ పనితీరు.. ఈ రంగంలో ఏ షేర్లను కొనాలి, ఇంకే షేర్లను అమ్మివేయాలి అన్న అంశంపై జేఎం ఫైనాన్షియల్‌ ఒక రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ రీసెర్చ్‌ సంస్థ రిపోర్ట్‌ ఆధారంగా 2017-18 మొదటి త్రైమాసికంలో బ్యాంకింగ్‌ రంగ పనితీరు ఇంతకుముందు క్వార్టర్ల మాదిరిగానే పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే.. నికర లాభం 23 శాతంగా (ప్రైవేట్‌ బ్యాంకులు 11 శాతం, పీఎస్‌యూ బ్యాంకులు 1.75 రెట్లు) నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రీ-ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్‌ (పీపీఓపీ) వృద్ధి 5 శాతంగా ఉండే అవకాశం ఉంది. క్రెడిట్‌ గ్రోత్‌లో కూడా పీపీఓపీ మాదిరిగా పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చంటున్న జేఎం ఫైనాన్షియల్‌.. రుణమంజూరీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండనుందని అంచనా వేసింది. నిర్వహణ ఆదాయం 8 శాతంగా ఉండొచ్చని అంటోంది. ఈ కీలక అంచనాలను ఆధారంగా చేసుకుని ఏ షేరును కొనాలి..? ఏ షేరును అమ్మాలి..? అనే జాబితాను రూపొందించింది. 

 

జేఎం ఫైనాన్షియల్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ పూర్తి వివరాలు, రెకమండేషన్లను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1499497802Indian Banking Sector.pdf)





You may be interested

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఫలించేనా..?

Saturday 8th July 2017

ముంబై: దేశంలోని ఇల్లు లేని పేదలకు ఆశాదీపంలా కనిపిస్తోన్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏఐ) పథకం అనుకున్న స్థాయిలో ఫలితాలు అందిస్తుందా..? అసలు ఈ పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తుందా అనే అంశంపై జేఎం ఫైనాన్షియల్‌ సంస్థ ఒక రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం  జూలై 6, 2017 నాటికి పిఎంఏఐ పథకం కింద సుమారు 55,000 నూతన గృహాల నిర్మాణం పూర్తయ్యింది.

బఫెట్‌ స్లైల్లో భారీ రాబడులు...

Saturday 8th July 2017

ఇంటిలిజెంట్‌ ఇన్వెస్టర్‌గా మారడమే మార్గం సాధారణంగా షేర్‌ మార్కెట్‌ అంటే ప్రజల్లో ఒక విధమైన భయంఉంటుంది. కనీస పెట్టుబడి సూత్రాలు పాటించకుండా ఈక్విటీల్లో చేతులు కాల్చుకోవడం వల్ల వచ్చే భయం సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆధునిక పెట్టుబడి పద్ధతులు, సిద్ధాంతాలు సాధారణ మదుపరి అర్ధం చేసుకోలేని స్థాయిలో ఉండడం కూడా మరో కారణం. అయితే భారీ సూత్రాలు, సిద్ధాంతాలతో పనిలేకుండా స్వల్ప పరిజ్ఞానంతో ఈక్విటీల్లో లాభాలు పండిచుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి

Most from this category