STOCKS

News


వరుసగా నాలుగో వారంలోనూ తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 19th May 2018
Markets_main1526718148.png-16614

ముంబై:- దేశంలో విదేశీ మారక ద్రవ్యపు నిల్వలు వరుసగా నాలుగో వారంలోనూ తగ్గాయి. ఈ వారంలో రూపాయి భారీ పతనం, అంతర్జాతీయంగా ముడిచమురు నాలుగేళ్ల గరిష్టస్థాయి చేరుకోవడం ఫారెక్స్‌ నిల్వలు తగ్గుదలకు కారణమయ్యాయి. మే 11తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వలు 1.2 బిలియన్ల డాలర్ల మేర తగ్గి 417.7 బిలియన్‌ డాలర్లు నమోదైనట్లు భారతీయ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి రూపాయి వరుసగా ఆరో వారంలో 30 పైసల నష్టంతో 68 వద్ద ముగిసింది. డాలర్, యూరోలతో పోలిస్తే కొంత కాలంగా రూపాయి మారకం విలువ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. ఫారెక్స్‌ మార్కెట్లో నెలకొన్న అస్థిరతను తొలగించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ ప్రకటించింది.  సమీక్షిస్తున్న వారం(మే 11)లో విదేశీ కరెన్సీ అస్తులు 1.26 బిలియన్‌ డాలర్లు తగ్గి 392.45 డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎప్‌) వద్ద ఉన్న స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 0.3 మిలియన్లు స్వల్పంగా తగ్గి 1.51 బిలియన్‌ డాలర్లకి చేరుకోనున్నాయి. అయితే అనూహ్యంగా పసిడి నిల్వలు మాత్రం 26.2 మిలియన్‌ డాలర్లు పెరగి 21.68 బిలియన్‌ డాలర్లకి చేరుకున్నాయి. ఈ ఏడాది(2108) ఏప్రిల్‌ 13తో ముగిసిన వారాంతానికి 426.082 బిలియన్‌ డాలర్లకు చేరి లైఫ్‌ టైమ్‌ గరిష్టానికి చేరాయి.



You may be interested

ఈ 3 షేర్లు ఆకర్షణీయం..!

Saturday 19th May 2018

ముంబై: పెరిగిన ముడిచమురు ధరలు, బాండ్‌ ఈల్డ్‌.. నిరాశపరిచిన పలు కార్పొరేట్‌ కంపెనీల ఫలితాల కారణంగా గడిచిన వారంలో మార్కెట్‌ పడిపోయిందని విశ్లేషించిన ఈక్విటీ 99డాట్‌కామ్‌ ఫౌండర్ సుమిత్ బిల్గాయన్.. కర్ణాటక పీఠం ఎవరికి దక్కనుందనే ఉత్కంఠ ఇందుకు మరింత ఆజ్యంపోసిన నేపథ్యంలో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురై మార్కెట్‌ నెగటీవ్‌ జోన్‌లోనికి వెళ్లిపోయిందని అన్నారు. ఇక వచ్చేవారంలోని కీలక అంశాల విషయానికి వస్తే.. సోమవారం

10,400-10,450 స్థాయికి నిఫ్టీ..!

Saturday 19th May 2018

పీఎన్‌బీ షేరు టార్గెట్‌ రూ.68-65 లుపిన్‌, సన్‌ఫార్మా షేర్లలో మరో 10 శాతం పతనం..! ముంబై: ఎగువస్థాయిలో నిఫ్టీకి 10,700 వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకానుండగా.. దిగువస్థాయిలో 10,400-10,450 వద్ద మద్దతు ఉందని ఇండియా బుల్స్ వెంచర్స్ హెడ్‌ రీసెర్చ్‌ మనవ్ చోప్రా విశ్లేషించారు. ఇంతకుముందు సపోర్ట్‌ స్థాయిగా ఉన్న 10,700 ఇప్పడు ప‌టిష్టమైన నిరోధస్థాయిగా ఉందన్నారు. నిఫ్టీ 10,100 నుంచి 10,800 స్థాయికి చేరిన క్రమంలో కీలక స్థాయిలను అధిగమించి.. ఓవర్‌బాట్‌

Most from this category