STOCKS

News


భారీ ఎగుమతులు, పెట్టుబడులతోనే 8శాతం వృద్ధి సాధ్యం

Monday 16th April 2018
news_main1523859673.png-15529

  • భారత్‌పై ఏడీబీ అభిప్రాయం..

న్యూఢిల్లీ: పెట్టుబడులకు పునరుత్తేజం, ఎగుమతులు భారీగా పెంచుకోగలిగితేనే భారత్‌ నిలకడగా 8 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) పేర్కొంది. ‘ప్రస్తుతం పెట్టుబడులు, ఎగుమతులు ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. ఈ రెండు చోదకాలు గనుక జోరందుకుంటే 8 శాతం వృద్ధి సాధ్యమే. వ్యవసాయ మార్కెటింగ్‌ను గాడిలోపెట్టడం, సరఫరాపరమైన అడ్డంకులను తొలగించడం వంటివి కూడా చాలా కీలకం. ఈ రెండు అంశాల్లో మరిన్ని సంస్కరణలకు ఆస్కారం ఉంది’ అని ఏడీబీ ఆర్థికవేత్త అభిజిత్‌ సేన్‌ గుప్తా వ్యాఖ్యానించారు. తాజాగా విడుదల చేసిన ఆసియా అభివృద్ధి అంచనా–2018 నివేదికలో భారత్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2018–19)లో 7.3 శాతం, వచ్చే ఏడాది(2019–20)లో 7.6 శాతం చొప్పున వృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఏడీబీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

అవకాశాలు అపారం... 
ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటా ఇంకా చాలా తక్కువేనని, రానున్నకాలంలో దీన్ని పెంచుకోవడానికి అపారమైన అవకాశాలున్నాయని సేన్‌ తెలిపారు. ‘వేతనాల పెరుగుదల కారణంగా చైనా ఎగుమతులు ఖరీదైనవిగా మారుతున్నాయి. భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎగుమతుల పెంపుపై దృష్టిపెట్టాలి. దీనికోసం వ్యాపార సానుకూలత, మౌలిక సదుపాయాలను పెంచుకోవాల్సి ఉంటుంది’ అన్నారు. కాగా, భారత్‌ రెండంకెల వృద్ధిని సాధించగలదా అన్న ప్రశ్నకు... ఇదేమీ అసాధ్యం కాదు. అయితే, ఇప్పుడున్న మౌలిక సదుపాయాలు, నియంత్రణ పాలసీలతో దీర్ఘకాలంలోనైనా దీన్ని అందుకోగలుగుతుందా లేదా అనేది నా సందేహం. అనేక కీలక సంస్కరణలు దీనికి అవసరమవుతాయి’ అని సేన్‌ వివరించారు. ఇన్‌ఫ్రా, పారిశ్రామిక రంగానికి రుణాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయని.. ఇది సానుకూల పరిణామమని ఆయన చెప్పారు. అయితే, పెట్టుబడులు మరింత పెరిగేందుకు చాలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సేన్‌ అభిప్రాయపడ్డారు.You may be interested

నాబార్డ్‌ అధీకృత మూలధనం రూ.30వేల కోట్లకు

Monday 16th April 2018

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాబార్డ్‌ అధీకృత మూలధనాన్ని రూ,.30,000 కోట్లకు పెంచింది. దీంతో గ్రామీణాభివృద్ధి, సాగుకు మరిన్ని రుణాలు అందించడం ద్వారా తన కార్యకలాపాలు పెంచుకునేందుకు నాబార్డ్‌కు వీలు పడనుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన జాతీయ బ్యాంకు (నాబార్డ్‌) అధీకృత మూలధనాన్ని రూ.5,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచినట్టు ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన

ఫలితాలు, ప్రపంచ సంకేతాలతోనే..

Monday 16th April 2018

ఈ వారం మార్కెట్‌పై నిపుణులు సమీప భవిష్యత్తులో సిరియా ఉద్రిక్తతల ప్రభావం  ఈ వారమే టీసీఎస్, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏసీసీ ఫలితాలు  నేడు టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఈ వారం భారత్‌ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాల కూటమి...గత శనివారం తెల్లవారుజామున సిరియాపై దాడులు జరిపిన ప్రభావం సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై

Most from this category