STOCKS

News


బీఎస్‌ఈ ఐఎన్‌ఎక్స్‌లో ‘రికార్డ్‌’ టర్నోవర్‌

Saturday 13th January 2018
Markets_main1515781843.png-13102

ముంబై: బీఎస్‌ఈ ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం రూ.2,100 కోట్ల రికార్డ్‌ స్థాయి టర్నోవర్‌ నమోదయింది. ఈ ఎక్స్ఛేంజ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక టర్నోవర్ అని ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌ (ఐఎన్‌ఎక్స్‌) తెలిపింది. ఆరంభం నుంచి చూస్తే తమ టర్నోవర్‌ 1,000 కోట్ల డాలర్లకు చేరినట్లు ఇండియా ఐఎన్‌ఎక్స్‌ ఎండీ, సీఈఓ వి. బాలసుబ్రహ్మాణ్యమ్‌ చెప్పారు. ఈ ఎక్స్ఛేంజ్‌ రోజుకు 22 గంటలు పనిచేస్తుందని, జపాన్‌ మార్కెట్‌ మొదలైనప్పుడు ప్రారంభమై చికాగో మార్కెట్‌తో ముగుస్తుందని తెలియజేశారు.
గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీలో గత ఏడాది జనవరి 16 నుంచి ఈ ఎక్స్ఛేంజ్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత అధునాతన టెక్నాలజీ ప్లాట్‌ఫార్మ్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో ఇదొకటి. టర్న్‌ అరౌండ్‌ టైమ్‌ 4 మైక్రో సెకన్లని బాలసుబ్రహ్మణ్యమ్‌ తెలిపారు. ఈక్విటీలు, కరెన్సీలు, కమోడిటీలు అన్ని అసెట్‌ క్లాస్‌లకు ఒకే ప్లాట్‌ఫార్మ్‌ను ఈ ఎక్స్ఛేంజ్‌ అందిస్తోంది. త్వరలో డిపాజిటరీ రిసీట్స్‌, బాండ్లను కూడా అందుబాటులోకి తేనున్నామని ఆయన తెలియజేశారు.



You may be interested

ఐఎస్‌డీ కాల్‌ టెర్మినేషన్ రేటు తగ్గించిన ట్రాయ్‌

Saturday 13th January 2018

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ కాల్ టెర్మినేషన్ రేటును 53 పైసల నుంచి 30 పైసలకు తగ్గిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేటు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అధిక ఐఎస్‌డీ చార్జీల ప్రసక్తి లేకుండా వీవోఐపీ విధానంలో కొందరు అక్రమార్కులు ఇంటర్నేషనల్ కాల్స్‌ని భారత యూజర్లకు మళ్లిస్తుండటాన్ని నిరోధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలియజేసింది. అక్రమ ఐఎస్‌డీ

హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు రూ.1800 కోట్ల ఆర్డర్‌

Friday 12th January 2018

అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ రూ.1800 కోట్ల భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. మాస్కోకు చెందిన యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌... ఈకేఎం క్లాస్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణం కోసం ఈ ఆర్డర్‌ను ఇచ్చింది. యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ డైరెక్టర్‌ అలెక్సే వి డిక్కీ, మిలిటరీ అండ్‌ టెక్నికల్‌ కార్పొరేషన్‌  ప్రతినిధుల బృందం ఈ నెల 10న విశాఖకు వచ్చి షిప్‌యార్డు అధికారులతో మూడు రోజుల పాటు  చర్చలు

Most from this category