STOCKS

News


శ్రీమలానితో ఐకియా జట్టు

Monday 12th February 2018
news_main1518460182.png-13918

చిన్నశంకరంపేట(మెదక్‌): స్వీడన్‌కి చెందిన ఫర్నీచర్ దిగ్గజ సంస్థ ఐకియా తాజాగా శ్రీమలాని ఫోమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐకియా సంస్థకు తాము స్ప్రింగ్‌ ఫోమ్స్‌ను సరఫరా చేయనున్నట్లు శ్రీమలాని ఫోమ్స్ ఎండీ సిద్ధార్థ మలాని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కూడా ఈ ఒప్పందం తోడ్పడగలదని ఆయన వివరించారు. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించే క్రమంలో శ్రీమలాని ఫోమ్స్‌తో చేతులు కలిపినట్లు ఐకియా బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌ పంకజ్ దత్తా తెలిపారు. మెదక్‌లోని శ్రీమలాని ఫోమ్స్ ప్లాంటును ఐకియా ప్రతినిధులు సందర్శించిన సందర్భంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.  

 



You may be interested

స్థిరంగా పసిడి ధర..!

Tuesday 13th February 2018

న్యూయార్క్‌:- అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం పసిడి ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. కీలకమైన వడ్డీరేట్లపై ప్రభావాన్ని చూపే యూఎస్‌ఏ ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. దీనికి తోడు డాలర్‌ ఇండెక్స్‌ గత ముగింపుతో పోలిస్తే స్వల్పంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆసియా ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి ఔన్స్‌(31.1గ్రా) నైమెక్స్‌ కాంట్రాక్టు ధర గత పోలిస్తే 7 డాలర్లు పెరిగి 1,327.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాలో  మాత్రం ఔన్స్‌ పసిడి ధర 1,326.40

కార్పొరేషన్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,240 కోట్లు

Monday 12th February 2018

పెరిగిన మొండి బకాయిలు  న్యూఢిల్లీ: కార్పొరేషన్‌ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,240 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.159 కోట్ల నికర లాభం సాధించామని కార్పొరేషన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,035 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,840 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.4,841 కోట్లకు తగ్గిందని తెలిపింది.   రెట్టింపుకు పైగా  కేటాయింపులు... స్థూల మొండి

Most from this category