STOCKS

News


ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఐపీఓ కాస్ట్‌లీనే- సెంట్రమ్‌

Thursday 22nd March 2018
Markets_main1521701522.png-14872

ముంబై: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పబ్లిక్‌ ఇష్యూ మార్చి 22న (గురువారం) ప్రారంభమయ్యింది. మార్చి 26న ముగియనున్న ఈ ఇష్యూ ధరల శ్రేణి ప్రతి ఈక్విటీ షేర్‌కు రూ. 519–520గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. కనీసం 28 షేర్లకు బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.5 ముఖ విలువ కలిగిన 7.72 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇవి ఇష్యూకు సంబంధించిన వివరాలు కాగా.. వాల్యూయేషన్‌ మరీ ఎక్కువగా ఉందని సెంట్రమ్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. రూ.520 అయిన అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద ఇష్యూ ధరను తీసుకుంటే 2017 ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌ కంటే ఏకంగా 49.6రెట్లు ధర ఎక్కువగా ఉన్నట్లు తెలియజేసింది. ఇదే ఆర్థిక సంవత్సరంలోని పుస్తకపు విలువ కంటే ఇష్యూ ధర 34.2 రెట్లు అధికమని వివరించింది. 

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద ఉన్న పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌లో పరిశీలించగలరు.

View Pdf One (1521701572Centrum Wealth - IPO Note - ICICI Securities Ltd - 21 March 2018.pdf)

You may be interested

6నెలల కోసం 10 సిఫార్సులు

Thursday 22nd March 2018

వచ్చే ఆరునెలల్లో కనీసం 20 శాతం రాబడినిచ్చే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. బొనంజా పోర్టుఫోలియో రికమండేషన్లు: 1. ఎం అండ్‌ ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 809. స్టాప్‌లాస్‌ రూ. 719. వీక్లీ చార్టుల్లో అధోముఖ పతన వాలు రేఖను పైవైపుగా ఖండించింది. డౌన్‌ట్రెండ్‌ ముగింపునకు ఇది సంకేతం. డైలీ చార్టుల్లో మూవింగ్‌ యావరేజ్‌లు గోల్డెన్‌ క్రాస్‌ను ఏర్పరిచి పాజిటివ్‌ ట్రెండ్‌ను బలపరుస్తున్నాయి. 2. ఎల్‌ అండ్‌ టీ: కొనొచ్చు.

అడాగ్‌ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలు

Thursday 22nd March 2018

ఆర్‌కామ్‌కు సుప్రీంలో సైతం లభించని ఊరట తీవ్ర రుణభారంతో సతమతమవుతూ...దివాళా ముంగిట నిలిచిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)కు సుప్రీంకోర్టులో సైతం ఊరట లభించకపోవడంతో గురువారం అనిల్‌ ధీరూబాయ్‌ అంబానీ గ్రూప్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి లోనయ్యాయి. ఆర్‌కామ్‌ షేరు 4 శాతంపైగా క్షీణించి రూ. 24 వద్దకు చేరగా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, రిలయన్స్‌ కేపిటల్‌ షేర్లు 2 శాతంపైగా తగ్గాయి. దయం 11 గంటల సమయానికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రా రూ. 438

Most from this category