News


బాండ్ల జారీ ప్రకటనతో ఐసీఐసీఐ జోష్‌

Wednesday 28th June 2017
Markets_main1498643727.png-4499

 దీర్ఘకాలిక డిబెంచర్లు  కేటాయించడం ద్వారా రూ . 2147 కోట్లను సమీకరించనున్నట్లు  ప్రకటించడంతో ఐసిఐసిఐ బ్యాంక్ షేరు ధర ఊపందుకుంది. దీంతో బ్యాంక్‌ షేరు ధర 1.3 శాతం బలపడి రూ. 292 వద్ద ట్రేడవుతోంది. ​కాగా బాండ్లను విక్రయిస్తున్నట్లు మంగళవారం  ట్రేడింగ్‌ సమయంలో  వెల్లడించింది.   రూ. 2147 కోట్ల సమీకరణకు  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఆమోద ముద్ర వేసింది.  ప్రైవేట్ ప్లేస్మెంట్ ఆధారంగా   21,470 సీనియర్, అన్‌సెక్యూర్‌  డిబెంచర్లను మార్చుకోనే విధంగా గల దీర్ఘకాలిక బాండ్లు కేటాయించేందుకు  మంగళవారం అమోదించామని  ఐసిఐసిఐ బ్యాంక్  తెలిపింది.. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో   ఐసీఐసీఐ  రూ. 1282.57 కోట్ల కాపిటల్‌  ఈక్విటీ తో ప్రధమస్థానంలో  ఉంది.గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాల్లో ఐసిఐసిఐ బ్యాంక్ నికర లాభం 188.5% పెరిగి  రూ 2024.64 కోట్లను ఆర్జించగా... కాగా    వరకు మొత్తం ఆదాయం 10.8% క్షీణించి రూ 16585.76 కోట్లకు చేరింది. బ్యాంకు షేరుధర  52 వారాల గరిష్ట, కనిష్ట స్థాయిలు వరుసగా రూ. 297.73, రూ 209.05 గా నమోదయ్యాయి.







You may be interested

9,500 పాయింట్ల దిగువన క్లోజయిన నిఫ్టీ

Wednesday 28th June 2017

  స్టాక్‌  మార్కెట్‌ పతనం బుధవారం కూడా కొనసాగింది. జూన్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు రేపు(గురువారం) ముగియనున్నందున స్టాక్‌ సూచీలు ఆద్యంతం ఒడిదుడుకులకు గురయ్యాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 159 పాయింట్ల వరకూ నష్టపోయింది. నిఫ్టీ కీలకమైన 9,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండడం ప్రతికూల ప్రభావం చూపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 124 పాయింట్ల నష్టంతో 30,834 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 9,491 పాయింట్ల

చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ కొనొచ్చు

Wednesday 28th June 2017

కంపెనీ: చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ సిఫార్సు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రెకమండేషన్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.1,083 (జూన్‌ 28, 2017న) టార్గెట్‌ ధర: రూ.1296 సమయం: 12 నెలలు   రూ.985 నుంచి రూ.1063 మధ్య రేంజ్‌లో ఉన్నప్పుడు చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌ను కొనుగోలు చేయవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేస్తోంది. రూ.985 వరకు పడినప్పుడల్లా (బై ఆన్‌ డిప్స్‌) కొనుగోలు చేయమని సూచిస్తోంది.   పూర్తి వివరాలకు పీడీఎఫ్‌ అటాచ్‌మెంట్‌ను పరిశీలించగలరు.

Most from this category