News


రిటైల్‌ మదుపరులపై జిఎస్‌టి ప్రభావమెంత?

Saturday 1st July 2017
Markets_main1498905691.png-4672

జిరోధా నిఖిల్‌ కామత్‌
జిఎస్‌టితో రిటైల్‌ బ్రోకింగ్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఇప్పటివరకు రిటైల్‌ బ్రోకింగ్‌పై ఉన్న సర్వీస్‌ టాక్స్‌ కన్నా, జిఎస్‌టి కొంచెం అధికమే అయినా, ఈ తేడా చాలా తక్కువనే చెప్పాలి. గతంలో కృషి కళ్యాణ్‌ సెస్‌; స్వచ్‌భారత్‌సెస్‌తో కలిపి బ్యాంకింగ్‌ లావాదేవీలు, ఎంఎఫ్‌, స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలపై సుమారు 15 శాతం సర్వీస్‌టాక్స్‌ ఉండేది. తాజాగా ఈ పన్ను 18 శాతం వరకు పెరగనుంది. అదేవిధంగా ఎంఎఫ్‌లపై విధించి టిఇఆర్‌(సంపూర్ణ వ్యయ నిష్పత్తి) సైతం 4- 5 బేసిస్‌ పాయింట్ల మేర పెరగనుంది. స్టాక్‌ బ్రోకింగ్‌కు సంబంధించి విధించే సర్వీస్‌ టాక్స్‌ చాలా చిన్న మొత్తమని చెప్పవచ్చు. ఈ మొత్తం జిఎస్‌టితో కాస్త పెరగనుంది. ఇంతకుమించి జిఎస్‌టితో ఎంఎఫ్‌ల్లో, రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో పెను ప్రభావం చూపకపోవచ్చని అంచనా. ఉదాహరణకు రిటైల్‌ ఇన్వెస్టర్‌ గతంలో 100 రూపాయల లావాదేవీపై 15 రూపాయల పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది జిఎస్‌టితో 18 రూపాయలకు పెరగనుంది. ఈ స్వల్పభారం మినహా పెద్ద తేడాలు కనిపించవని అభిప్రాయం.







You may be interested

యాప్‌కీ కహానీ... ఎస్‌బీఐ రివార్డ్జ్‌

Sunday 2nd July 2017

మీరు స్టేట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ కస్టమరా? అయితే దీన్ని మీరు తెలుసుకోవాల్సిందే. ‘ఎస్‌బీఐ రివార్డ్జ్‌’ యాప్‌లో మనం నిర్వహించిన బ్యాంకింగ్‌ లావాదేవీలపై రివార్డు పాయింట్లను పొందొచ్చు. అలాగే వీటిని రిడీమ్‌ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  ప్రత్యేకతలు - బ్యాంకుకు సంబంధించిన డెబిట్‌ కార్డు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్, ఎస్‌ఎంఈ అకౌంట్, రూరల్‌ బ్యాంకింగ్, డీమ్యాట్‌ ఖాతా వంటి తదితర వాటి ద్వారా

ఓరియంటల్‌ కార్బన్‌ అండ్‌ కెమికల్స్‌ కొనొచ్చు

Saturday 1st July 2017

కంపెనీ: ఓరియంటల్‌ కార్బన్‌ అండ్‌ కెమికల్స్‌ (ఓసీసీఎల్‌) సిఫార్సు: సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్ రెకమండేషన్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.975 (జూన్‌ 30, 2017న) టార్గెట్‌ ధర: రూ.1,140   రబ్బర్‌ మిశ్రమంలో ఉపయోగించే డైమండ్‌ సల్ఫ్‌ (సల్ఫర్‌లో అధునాత రకం), సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తి, మార్కెటింగ్‌లో కార్యకలాపాలు నిర్వహించే ఓరియంటల్‌ కార్బన్‌ అండ్‌ కెమికల్స్‌ (ఓసీసీఎల్‌) కంపెనీ షేరును కొనుగోలు చేయవచ్చని సెంట్రమ్ బ్రోకింగ్ లిమిటెడ్ సూచిస్తోంది. టైర్లు, రబ్బర్‌ తయారీలో ఉపయోగపడే ఉత్పత్తులను అందిస్తున్న ఈ సంస్థ

Most from this category