News


లక్ష్యాలకు రక్షణ

Tuesday 12th September 2017
personal-finance_main1505154689.png-8404

జీవితం అన్న తర్వాత లక్ష్యాలు తప్పకుండా ఉంటాయి... లక్ష్యాలుంటే కాదు, వాటిని నెరవేర్చుకునేందుకు తగిన వ్యూహాలు కూడా అవసరం. తమ ఆదాయం, రిస్క్‌కు అనుగుణంగా వాటికి చేయాల్సి కేటాయింపులు (అస్సెట్‌ అలోకేషన్‌), పనితీరు సమీక్ష ఇవన్నీ ఇన్వెస్టర్లు తప్పకుండా అనుసరించాల్సినవి. అప్పుడే లక్ష్యాలకు రక్షణ లభిస్తుంది. ఈ విషయంలో నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి.

వర్గీకరణ

మార్కెట్లు పడిపోయినప్పుడు సహనంతో ఓపిక పడితే అవి తిరిగి కుదురుకుంటాయి. అందుకు కొంత సమయం పడుతుంది. అయితే, అప్పటి వరకు లక్ష్యాలు ఆగవు కదా. మీ పాప లేదా బాబు కాలేజీ ఫీజు చెల్లించాలనుకోండి... మార్కెట్లు పడిపోయాయి కొన్నాళ్లు ఓపిక పట్టాలని చెప్పలేరు. అందుకే లక్ష్యాలను ప్రాధాన్యతల వారీగా వేరుచేసుకోవడం ఎంతో అవసరం. లక్ష్యాలను క్రిటికల్‌, నాన్‌ క్రిటికల్‌ అన్న రెండు కేటగిరీలుగా విభజించుకోవాలి. వాటికనుగుణంగా నడచుకోవాలి. క్లిష్టమైన లక్ష్యాల్లో పిల్లల విద్య, ఇంటి రుణానికి అవసరమైన డౌన్‌పేమెంట్‌ మొదలైనవి ఉండాలి. నాన్‌ క్రిటికల్‌ లక్ష్యాల్లో విదేశీ పర్యటన, ఇంటి నవీకరణ, కొత్త కారు వంటివి ఉండాలి.

లక్ష్యాలకు రిస్క్‌ జోడింపు

లక్ష్యాలను రెండు కేటగిరీలు చేసిన తర్వాత ఎంత సమయం, ఎంత రాబడి తదితర అంశాల ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. పిల్లల విద్య వంటి కీలక లక్ష్యాలకు అవసరమైన డబ్బుల్ని అధిక శాతం ఈక్విటీల్లో పెట్టేయడం సరైనది కాదు. కనీస ఓ పదేళ్ల కాల వ్యవధి ఉంటే డెట్‌, ఈక్విటీలకు కేటాయింపులు 50-50 ఉండేలా చూసుకోవచ్చు. అంతేకాదు ఈక్విటీల్లోనూ లార్జ్‌క్యాప్‌ ఎంచుకోవడమే కాస్తంత సురక్షితం. 

సమీక్ష

లక్ష్యాలు, వాటికి తగిన పెట్టుబడుల ప్రణాళికను ఫిక్స్‌ చేసిన తర్వాత వాటి పనితీరును కూడా క్రమం తప్పకుండా విశ్లేషిస్తూ వెళ్లాలి. ప్రతీ ఆరు నెలలకు ఓసారి ఇలా చేయాలి. దీనివల్ల అస్సెట్‌ అలోకేషన్‌లో మార్పులు చేయాలా, వద్దా అన్నది తెలుస్తుంది. ఒకవేళ డెట్‌కు 50, ఈక్విటీకి 50 శాతం కేటాయించిన తర్వాత వాటి పనితీరు ఆధారంగా ఏడాది తర్వాత ఈక్విటీల్లో పెట్టుబడులు 70 శాతం విలువకు చేరే అవకాశం లేకపోలేదు. దీంతో సమీక్ష వల్ల అలోకేషన్‌ను రిస్క్‌కు తగ్గట్టు మార్చుకునేందుకు వీలవుతుంది. 







You may be interested

యువతకు ఈక్విటీలతో బోలెడు లాభాలు

Tuesday 12th September 2017

ఒకప్పటితో పోలిస్తే నేడు ఈక్విటీ మార్కెట్లలోకి చాలా చిన్న వయసులోనే యువ ఇన్వెస్టర్లు ప్రవేశిస్తున్నారు. చిన్నప్పుడే ఈ మార్కెట్లోకి రావడం వల్ల ఉన్న వెసులుబాటు ఏమంటే... ఇన్వెస్ట్‌ చేసేందుకు ఎంతో సమయం చేతుల్లో ఉంటుంది. దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ మహిమ వల్ల భారీ సంపద సృష్టికి అవకాశం ఉంటుంది. కానీ, ఎందరు ఇందులో సక్సెస్‌ అవుతున్నారు? అంటే తెల్లమొహం వేయాల్సిందే. ఈ విషయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదన్న విషయాలను హెచ్‌డీఎఫ్‌సీ

నిఫ్టీ... ఫ్యూచర్స్‌ సిగ్నల్స్‌

Monday 11th September 2017

స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్‌ అండ్‌ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్‌? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్‌ ఇంట్రస్ట్‌ హెచ్చుతగ్గులు... కాల్‌, పుట్‌ రైటింగ్‌ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్‌ సిగ్నల్స్‌’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... నిఫ్టీ ప్రపంచ ట్రెండ్‌ ప్రభావంతో ఇక్కడ

Most from this category