STOCKS

News


చిన్న బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువే... మరి భద్రత?

Wednesday 16th May 2018
personal-finance_main1526480006.png-16512

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు మన దేశంలో గత రెండేళ్ల కాలంలో కొలువు దీరాయి. ఇవి డిపాజిట్లపై ప్రధాన బ్యాంకులతో పోలిస్తే కాస్తంత ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. రిస్క్‌ తీసుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లకు ఒక శాతం వడ్డీ అదనం అంటే తేలిగ్గా తీసిపారేసే విషయం అయితే కాదు. మరి చిన్న బ్యాంకుల్లో అధిక వడ్డీ ఆదాయం కోసం డిపాజిట్‌ చేస్తే భద్రత ఎంత వరకూ...? అన్న సందేహం రావచ్చు. 

అధిక వడ్డీ రేట్లు

చిన్న బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఏడాది కాలం నుంచి మూడేళ్ల కాల వ్యవధికి 8.5 శాతం నుంచి 8.75  శాతం వరకూ ఉన్నాయి. సాధారణ బ్యాంకులతో పోటీ పడి డిపాజిట్లను ఆకర్షించేందుకే ఈ స్థాయి వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. ఎస్‌బీఐ సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్ల(రూ.కోటి వరకు)పై 3.5 శాతమే వడ్డీ చెల్లిస్తోంది. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయి. సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు 6.25 శాతం, ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు 6 శాతం చొప్పున సేవింగ్స్‌ ఖాతాల డిపాజిట్లపై వడ్డీ ఆఫర్‌ చేస్తున్నాయి. ఈక్విటస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు 6 శాతం, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకులు 5 శాతం చొప్పున చెల్లిస్తున్నాయి. ఇక సాధారణ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీ గమనిస్తే... సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఏడాది కాలానికి 8.5 శాతం, మూడేళ్ల కాలానికి 8.75 శాతం, ఐదేళ్లు అయితే 7.25 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తోంది. ఫిన్‌కేర్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఏడాది, మూడేళ్ల కాల డిపాజిట్లపై 8 శాతం, ఐదేళ్ల డిపాజిట్లపై 7 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈక్విటస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఏడాది కాలానికి 7.5 శాతం, మూడేళ్లకు, ఐదేళ్ల డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఆఫర్‌ చేస్తోంది. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఏడాది కాల డిపాజిట్లపై 7.15 శాతం, మూడేళ్లకు 7.3 శాతం, ఐదేళ్లకు 7.25 శాతం చొప్పున చెల్లిస్తోంది. 

భద్రత

వడ్డీయే కాదు తమ పెట్టుబడికి రక్షణ కూడా డిపాజిట్‌దారులకు ముఖ్యమేన అంశమే. చిన్న డిపాజిట్‌ దారులకు బ్యాంకు డిపాజిట్‌తో ఎంతో సౌకర్యం. అయితే, స్మాల్‌ బ్యాంకులు కొత్తవి కావడంతో వాటి నిలకడపై డిపాజిట్‌దారుల్లో ఆందోళన ఉంది. బ్యాంకుల నిర్వహణలో కేంద్రం, ఆర్‌బీఐ ట్రాక్‌ రికార్డును గమనించినట్టయితే ఈ విధమైన ఆందోళనలు అనవసరమని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక, డిపాజిట్‌ ‘ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌’ కింద సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌, కరెంట్‌, రికరింగ్‌ డిపాజిట్లలో రూ.లక్ష వరకు రక్షణ ఉంటుంది. బ్యాంకులు విఫలమైతే అప్పుడు గరిష్టంగా రూ.లక్ష వరకూ డిపాజిట్‌ దారులకు పరిహారంగా లభిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు, 2017 పాస్‌ అయితే ఈ కవరేజీ ఇంకా పెరుగుతుందంటున్నారు పరిశీలకులు. 

 



You may be interested

ఎంత సొమ్మూ చాలట్లేదు..

Wednesday 16th May 2018

ఎకానమీకి గుదిబండల్లాగా మారుతున్న బ్యాంకులు క్యు4లో రూ. 43వేల కోట్లకు చేరిన పీఎస్‌బీల నష్టాలు ఈ మొత్తం బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీలో సగానికన్నా ఎక్కువ ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితాలు పూజ్యం ఎంత సాయమూ చాలని వైనం   లక్ష భక్ష్యాలు తినే లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యం లెక్కా! అని నానుడి...  తూచ్‌.. తూచ్‌..  అదంతా గతం..  ఇప్పుడు  లక్షల కోట్ల నష్టాలున్న పీఎస్‌బీలకు వేల కోట్ల సాయం ఓ లెక్కా! అనేది సరికొత్త నానుడి.. ఎన్ని నీళ్లు పోసినా సముద్రం నిండదన్నట్లు బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం

మార్కెట్లు తగ్గితే కొనడం... అదే మేం సూచించేది: క్వాంటం

Wednesday 16th May 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత మూడు నెలలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక అంశం మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా కర్ణాటకలో బీజేపీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టినా, అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో మన మార్కెట్ల గమనంపై క్వాంటం గ్రూపు వ్యవస్థాపకుడు సందీప్‌ టాండన్‌ తన అభిప్రాయాలను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.  మార్కెట్లపై కర్ణాటక ఫలితాల

Most from this category