News


జియోజిత్‌ హాట్‌ పిక్స్‌ ఇవే....

Thursday 31st August 2017
Markets_main1504162541.png-7802

జియోజిత్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆణిముత్యాల్లాంటి 3 షేర్లను సిఫార్సు చేస్తోంది. అవేంటంటే..

 

ఎన్‌బీసీసీ ఇండియా లిమిటెడ్‌
ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.206
టార్గెట్‌ ధర రూ.227

నవరత్న సంస్థలలో ఒకటైన ఎన్‌బీసీసీ....ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్‌, నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బలమైన ముద్రవేసింది. ప్రస్తుతం రూ.75,000 కోట్ల ఆర్డర్లు కంపెనీ చేతిలో ఉండగా, ఇవి 2017 అమ్మకాలతో పోల్చితే 12 రెట్లు అధికం కావడం విశేషం. 2018 ఆర్డర్ల అంచనా రూ.25,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 నికర లాభం 24 శాతం వృద్ధి చెందినట్లు ప్రకటించింది. 2017-19 ఎర్జింగ్స్‌ చక్రగతి వృద్ధి అంచనా 42 శాతం ఆధారంగా షేరు టార్గెట్‌ ధరను రూ.227గా నిర్ణయించినట్లు జియోజిత్‌ తెలియజేసింది.

 

మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్
ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.239
టార్గెట్‌ ధర రూ.291

విభిన్న ఉత్పత్తి పోర్టిఫోలియో, విస్తృత కస్టమర్ ప్రొఫైల్, బలమైన భౌగోళిక ఉనికి లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ షేరును రెకమండ్‌ చేస్తున్నట్లు జియోజిత్‌ ప్రకటిచింది. 2018 లో ఆదాయం 14 శాతం,  నికర లాభం 57 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనాల ఆధారంగా షేరు టార్గెట్‌ ధరను రూ.291గా నిర్ణయించినట్లు తెలియజేసింది.


జేకే లక్ష్మి సిమెంట్

ప్రస్తుత మార్కెట్‌ ధర రూ.418
టార్గెట్‌ ధర రూ.540

జేకే గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ దేశంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాలపై పట్టును పెంచుకుంటోంది. 12.5 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్‌ రంగంలో బలమైన ముద్రవేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 ఆదాయం 15.9 శాతం వృద్ధి చెందినట్లు ప్రకటించింది. ఇంధన ధరల భారం కారణంగా ఇబిటా కేవలం 2.4 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ ప్రకటించినప్పటికీ.. పెట్‌ కోక్‌ ధరలు తగ్గేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నయనే విశ్వసించే యాజమాన్య నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్లు ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు జియోజిత్‌ తెలియజేసింది. వర్షాకాలం అనంతరం కంపెనీ అమ్మకాలు జోరందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో షేరు టార్గెట్‌ ధరను రూ.291గా నిర్ణయించినట్లు తెలియజేసింది.

 

గమనిక: ఇది కేవలం జియోజిత్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిఫార్సులు మాత్రమే.  ఇన్వెస్టర్లు తమ సొంత విశ్లేషణ అనంతరం మాత్రమే షేర్లను కొనుగోలు చేయడం మంచిది. 







You may be interested

షెఫ్లర్‌​ ఇండియాకు విలీన వెలుగులు....

Thursday 31st August 2017

స్టాక్‌ సూచీలు ఒడిదుడుకుల మధ్య  ట్రేడవుతున్నా, షెఫ్లర్‌ ఇండియా (గతంలో ఫాగ్‌ బేరింగ్స్‌)  షేర్‌ మాత్రం లాభాల్లో సాగుతోంది. కంపెనీ అనుబంధ కంపెనీలు.. ఐఎన్‌ఏ బేరింగ్స్‌, లక్‌ ఇండియాలను విలీనం చేసుకుంటున్నామని షెఫ్లర్‌ ఇండియా ప్రకటించించడమే దీనికి ప్రధాన కారణం. దీంతో ఈ షేర్‌ గురువారం ఇంట్రాడేలో 17 శాతం వరకూ దూసుకెళ్లి రూ.4,981ను తాకింది. విలీనంలో భాగంగా  ప్రతి 65 ఐఎన్‌ఏ బేరింగ్స్‌ కంపెనీ షేర్లకు 10 ఈక్విటీ

20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన మాజెస్టిక్‌ ఆటో

Thursday 31st August 2017

ముంబై:- ఆటోమొబైల్‌ సెక్టార్‌కు చెందిన మెజిస్టిక్‌ ఆటో గురువారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 20శాతం లాభపడి రూ.122.40ల వద్ద అప్పర్‌ సర్య్కూట్‌ను తాకింది. నిన్న జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుసుకోవడం షేరు అప్పర్‌ సర్య్కూట్‌ దగ్గర లాక్ కావడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆ సమావేశంలో కంపెనీకి చెందిన ఆస్తులను రూ.300 కోట్ల వరకూ   విక్రయించాలన్న నిర్ణయించారు. ఇప్పటికే కంపెనీకి చెందిన 1,32,524  షేర్లు కొనుగోలు

Most from this category