STOCKS

News


హోండా అమేజ్‌లో రెండో జనరేషన్‌

Wednesday 16th May 2018
auto-mobiles_main1526487203.png-16516

  • ప్రారంభ ధర రూ.5.59 లక్షలు

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘హోండా కార్స్‌’ తాజాగా తన కాంపాక్ట్‌ సెడాన్‌ ‘అమేజ్‌’లో కొత్తగా సెకండ్‌ జనరేషన్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు. ఇది ఈ, ఎస్‌, వీ, వీఎక్స్‌ అనే నాలుగు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిల్లో డ్యూయెల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, రియర్‌  పార్కింగ్‌ సెన్సర్స్‌, ఏబీఎస్‌ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. తాజా కొత్త అమేజ్‌ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ రూపంలో మ్యానువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో లభ్యమౌతుందని వివరించింది. పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు- రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్‌ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు- రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయని పేర్కొంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు కొత్త ప్రాడక్టులను మార్కెట్‌లో తీసుకువస్తాం. అలాగే వచ్చే మూడేళ్ల కాలంలో మరో మూడు కొత్త ప్రొడక్టులను ఆవిష్కరిస్తాం’ అని హోండా కార్స్‌ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) ప్రెసిడెంట్‌, సీఈవో గకు నకనిశి తెలిపారు. హోండా సిటీ మాదిరిగానే సెకండ్‌ జనరేషన్‌ అమేజ్‌ కూడా కస్టమర్ల ఆదరణను చొరగొంటుందని ధీమా వ్యక్తంచేశారు. 



You may be interested

టాటా స్టీల్‌ లాభం రూ.14,688 కోట్లు 

Wednesday 16th May 2018

నష్టాల నుంచి లాభాల్లోకి న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.14,668 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బ్రిటన్‌ వ్యాపార పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన రూ.11,376 కోట్ల ఏకీకృత ఆదాయం ఈ స్థాయిలో లాభం పెరగడానికి కారణమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,168 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఈ మేరకు జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను బీఎస్‌ఈకి కంపెనీ

ఐటీసీ లాభం 10 శాతం అప్‌

Wednesday 16th May 2018

 రూ. 5.15 డివిడెండ్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,932 కోట్లకు పెరిగింది. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 2,669 కోట్లు. సమీక్షా కాలంలో ఐటీసీ అమ్మకాలు రూ. 10,706 కోట్లు. 2016-17 క్యూ4లో ఆదాయం రూ. 14,883 కోట్లు. జీఎస్‌టీపరమైన మార్పుల కారణంగా ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని ఐటీసీ తెలిపింది. క్యూ4లో

Most from this category