STOCKS

News


హిందుస్థాన్‌ షిప్‌యార్డుకు రూ.1800 కోట్ల ఆర్డర్‌

Friday 12th January 2018
news_main1515781704.png-13101

అల్లిపురం (విశాఖ దక్షిణ): విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ రూ.1800 కోట్ల భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. మాస్కోకు చెందిన యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌... ఈకేఎం క్లాస్‌ సబ్‌మెరైన్‌ నిర్మాణం కోసం ఈ ఆర్డర్‌ను ఇచ్చింది. యునైటెడ్‌ షిప్‌ బిల్డింగ్‌ డైరెక్టర్‌ అలెక్సే వి డిక్కీ, మిలిటరీ అండ్‌ టెక్నికల్‌ కార్పొరేషన్‌  ప్రతినిధుల బృందం ఈ నెల 10న విశాఖకు వచ్చి షిప్‌యార్డు అధికారులతో మూడు రోజుల పాటు  చర్చలు జరిపింది. ఇక్కడి మౌలిక సదుపాయాలు, హెచ్‌ఎస్‌ఎల్‌ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ భారీ ఆర్డర్‌ను ఇచ్చేందుకు వారు మొగ్గు చూపినట్లు హెచ్‌ఎస్‌ఎల్‌ సీఎండీ ఎల్‌.వి.శరత్‌బాబు చెప్పారు.



You may be interested

బీఎస్‌ఈ ఐఎన్‌ఎక్స్‌లో ‘రికార్డ్‌’ టర్నోవర్‌

Saturday 13th January 2018

ముంబై: బీఎస్‌ఈ ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం రూ.2,100 కోట్ల రికార్డ్‌ స్థాయి టర్నోవర్‌ నమోదయింది. ఈ ఎక్స్ఛేంజ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక టర్నోవర్ అని ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌ (ఐఎన్‌ఎక్స్‌) తెలిపింది. ఆరంభం నుంచి చూస్తే తమ టర్నోవర్‌ 1,000 కోట్ల డాలర్లకు చేరినట్లు ఇండియా ఐఎన్‌ఎక్స్‌ ఎండీ, సీఈఓ వి. బాలసుబ్రహ్మాణ్యమ్‌ చెప్పారు. ఈ ఎక్స్ఛేంజ్‌ రోజుకు 22 గంటలు పనిచేస్తుందని, జపాన్‌ మార్కెట్‌ మొదలైనప్పుడు

కర్ణాటక బ్యాంక్‌... రుణ నాణ్యత మెరుగు

Friday 12th January 2018

28 శాతం ఎగిసిన నికర లాభం  ముంబై: ప్రైవేట్‌ రంగ కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 28 శాతం ఎగసింది. గత క్యూ3లో రూ.69 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.87 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలియజేసింది. ఆర్జించిన వడ్డీ ఆదాయం నుంచి చెల్లించిన వడ్డీ ఆదాయాన్ని తీసివేయగా వచ్చే నికర వడ్డీ ఆదాయం 20 శాతం పెరిగిందని పేర్కొంది.

Most from this category