STOCKS

News


హిందాల్కో లాభం రూ.377 కోట్లు

Wednesday 16th May 2018
news_main1526489357.png-16528

  • 25 శాతం డౌన్‌
  • రికార్డ్‌ స్థాయి రాగి ఉత్పత్తి 

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.377 కోట్ల నికర లాభం(స్డాండ్‌ ఎలోన్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016-17) క్యూ4లో వచ్చిన నికర లాభం, రూ.503 కోట్లతో పోల్చితే 25 శాతం క్షీణించిందని హిందాల్కో వివరించింది. మొత్తం ఆదాయం కూడా రూ.11,970 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం వ్యయాలు ఎలాంటి మార్పు లేకుండా రూ.11,330 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. నిర్వహణ లాభం రూ.1,347 కోట్ల నుంచి 7 శాతం తగ్గి రూ.1,258 కోట్లకు తగ్గిందని తెలిపింది. నిర్వహణ మార్జిన్‌ 12.2 శాతం నుంచి 10.8 శాతానికి చేరిందని పేర్కొంది. అల్యూమినియమ్‌ వ్యాపారానికి సంబంధించిన ఇబిట్‌ ఫ్లాట్‌గా రూ.920 కోట్లుగా ఉండగా, కాపర్‌ వ్యాపారం ఇబిట్‌​ 34 శాతం క్షీణించి రూ.329 కోట్లకు తగ్గిందని తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో అల్యూమినియం వ్యాపార విభాగం ఆదాయం రూ.21,089 కోట్లుగా ఉందని హిందాల్కో తెలిపింది. అలాగే రాగి విభాగం ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.22,371 కోట్లకు పెరిగిందని తెలిపింది. అల్యూమినియమ్‌ లోహ అమ్మకాలు అధికంగా ఉన్నాయని, రియలైజేషన్లు కూడా బాగా ఉన్నాయని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 1,291 కిలో టన్నుల అల్యూమినాను ఉత్పత్తి చేశామని వివరించింది. ఇక అల్యూమినియమ్‌ ఉత్పత్తి 2 శాతం ఎగసిందని వివరించింది. ఇ‍‍క రాగి ఉత్పత్తి 410 కిలో టన్నులుగా ఉందని, కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్‌ స్థాయి పనితీరు సాధించామని ఆర్థిక ఫలితాలు కూడా బాగా ఉన్నాయని కంపెనీ సంతృప్తి వ్యక్తం చేసింది. వాటాదారులకు మరింత విలువను చూకూర్చేందుకు నాణ్యత, వినియోగదారుల అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని వివరించింది. 
విస్తరణ కోసం రూ.1,300 కోట్ల పెట్టుబడులు..
రాగికి సంబంధించిన కంటిన్యూయస్‌ కాస్ట్‌ రాడ్‌ప్లాంట్‌ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆరంభమైందని, ఉత్కళ్‌ ప్లాంట్‌ విస్తరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కంపెనీ వివరించింది. ఈ విస్తరణ కోసం రూ.1,300 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని, 30 నెలల్లో పూర్తవ్వగలదని పేర్కొంది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హిందాల్కో షేర్‌ 1.2 శాతం నష్టంతో రూ.240 వద్ద ముగిసింది. 


 



You may be interested

నెలలో రూ.1,000 కోట్లు డిపాజిట్‌ చేయండి

Wednesday 16th May 2018

జైప్రకాష్‌ అసోసియేట్స్‌కు సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లింపులు చేసేందుకు గాను జూన్‌ 15 నాటికి మరో రూ.1,000 కోట్లు డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు జైప్రకాష్‌ అసోసియేట్స్‌ను ఆదేశించింది. ఈ మేరకు డిపాజిట్‌ చేస్తే అనుబంధ సంస్థ జైపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌ (అమ్మకం) ప్రక్రియపై స్టే కొనసాగుతుందని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకవేళ గడువు నాటికి చెప్పిన మేర డిపాజిట్‌ చేయడంలో

క్రీమ్‌లైన్‌ డెయిరీ విస్తరణ

Wednesday 16th May 2018

కొత్తగా మరో మూడు ప్లాంట్లు రూ.400 కోట్ల పెట్టుబడి సంస్థ ఎండీ భాస్కర్‌ రెడ్డి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జెర్సీ బ్రాండ్‌ పేరుతో పాలు, పాల ఉత్పాదనల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్‌ డెయిరీ ప్రొడక్ట్స్ విస్తరణ చేపట్టనుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలో మూడేళ్లలో కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.400 కోట్లు వెచ్చిస్తామని సంస్థ ఎండీ కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. నూతన ఉత్పాదన జెర్సీ థిక్‌షేక్స్‌ ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కంపెనీ

Most from this category