రాష్ట్రాల ఆదాయానికి జీఎస్టీ ఊతం
By Sakshi

ముంబై: జీఎస్టీతో పన్ను రాబడులు మెరుగుపడటం, చమురు ధరలు పెరగడం తదితర అంశాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాలకు రూ. 37,426 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనుంది. ఎస్బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల ఆదాయం అదనంగా రూ. 18,698 కోట్ల మేర పెరిగింది. ఇక, పెరిగిన చమురు ధరల ప్రభావాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది రూ. 37,426 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. గతేడాది జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పట్నుంచీ పన్నుల పరిధిలోకి మరింత జనాభా రావడం, పన్నులను సక్రమంగా చెల్లించడం పెరగడం వంటి అంశాలతో పలు రాష్ట్రాలకు ట్యాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు.. జీఎస్టీతో అత్యధికంగా ప్రయోజనం పొందగా.. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో పన్ను వసూళ్లలో తగ్గుదల నమోదైంది. సంక్షేమ పథకాల అమలు కోసం పన్ను ఆదాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ కారణంగా ధరలు పెరిగి.. వినియోగదారులు ఇబ్బంది పడకుండా కూడా చూడాల్సి ఉంటుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది.
You may be interested
ఇరాన్ చమురు చెల్లింపులకు యూరో మార్గం బంద్!
Saturday 16th June 2018న్యూఢిల్లీ: ఇరాన్ నుంచి కొనుగోలు చేస్తున్న చమురుకు ఈ ఏడాది నవంబర్ నుంచి యూరోప్ బ్యాంకుల ద్వారా చెల్లింపులకు ద్వారాలు మూసుకుపోనున్నాయి. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రభుత్వరంగ ఎస్బీఐ చమురు రిఫైనింగ్ కంపెనీలకు తెలియజేసింది. నవంబర్ 3 నుంచి యూరో చెల్లింపుల మార్గం అందుబాటులో ఉండదని స్పష్టం చేసినట్టు ఐవోసీ డైరెక్టర్ ఏకే శర్మ తెలిపారు. గత నెలలో ఇరాన్‌తో కీలకమైన అణు ఒప్పందం
పార్టీ మీది.. ఏర్పాట్లు మావి!
Saturday 16th June 2018బర్త్‌డే, పెళ్లి రోజు వంటి వేడుకలకు కావాల్సిన ఉత్పత్తులు అద్దెకు రెంట్షేర్లో 40 కేటగిరీల్లో 12 వేలకు పైగా వస్తువులు ఏటా రూ.20 కోట్ల వ్యాపారం; హైదరాబాద్ వాటా 20 శాతం త్వరలోనే పుణె, కోచి, చంఢీఘడ్లకు సేవల విస్తరణ ‘స్టార్టప్ డైరీ’తో రెంట్‌షేర్ ఫౌండర్ హర్ష్ దండ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలు కావచ్చు... హాలీడే ట్రిప్స్, బ్యాచ్‌లర్, వీకెండ్ పార్టీలు కావచ్చు..