STOCKS

News


ఆకర్షణీయ డివిడెండు కోసం 5 షేర్లు..!

Tuesday 13th March 2018
Markets_main1520935804.png-14622

ముంబై: ప్రస్తుతం మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా కొనసాగుతున్నప్పటికీ పలు కంపెనీల షేర్లు మాత్రం ఆకర్షణీయంగానే ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి పలు ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందిన షేర్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైలైట్‌ అవుతాయని చెబుతున్న వీరు.. ఇందుకు ప్రధాన కారణం డివిడెండ్‌ అని అంటున్నారు. ప్రస్తుతం ఫిక్సిడ్‌ డిపాజిట్లపై బ్యాంకులు 6-7 శాతం వడ్డీ చెల్లిస్తుండగా, ఈ స్థాయిలో డివిడెండ్‌ ఈల్డ్‌ ఇవ్వడంలో పలు ప్రభుత్వరంగ కంపెనీలు ముందు వరుసలో ఉంటున్నాయని పలు బ్రోకింగ్‌ సంస్థలు వెల్లడించాయి. ఈ కోవకు చెందిన 5 షేర్లను సిఫార్సు చేస్తోంది. అవేంటంటే..

కోల్‌ ఇండియా
ప్రస్తుత ధర రూ.297 (మార్చి 13, 2018)
ఏడాదిలో షేరు పెరుగుదల : 16.3 శాతం

దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం బొగ్గులో 84 శాతం ఉత్పత్తి ఈ కంపెనీయే చేస్తుండగా.. షేరు వాల్యూయేషన్స్‌ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయని బ్రోకింగ్‌ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. గ్రేడ్‌ తగ్గిపోవడం, వేతన పెంపు అంశాలు ప్రతికూలంగా కనిపిస్తునప్పటికీ, విద్యుత్ ఉత్పాదక వృద్ధిలో కంపెనీ కీలక పాత్ర పోషిస్తుండడం ఆకర్షణీయ లాభాలకు కారణంగా నిలువనుందని విశ్లేషించింది. 5-8 శాతం డివిడెండ్‌ ఈల్డ్‌గా లెక్కకట్టింది.

ఎన్‌ఎండీసీ
ప్రస్తుత ధర రూ.123 (మార్చి 13, 2018)
ఏడాదిలో షేరు పెరుగుదల : (-9.8శాతం)

నగదు నిల్వలు పెంచుకుంటు పోవడం ద్వారా కంపెనీ అధిక డివిడెండ్‌ ప్రకటించేందుకు ప్రణాళికలు చేస్తోందని బ్రోకింగ్‌ సంస్థ యాంటిక్యూ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడుతోంది. 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.5.2 డివిడెండ్‌ను ప్రకటించగా, ఇది 4 శాతం డివిడెండ్‌ ఈల్డ్‌గా ఉందని వెల్లడించింది. రూ.186 వద్ద టార్గెట్‌ ధరను ప్రకటిస్తూ బై రేటింగ్‌ ఇచ్చింది.

ఓఎన్‌జీసీ
ప్రస్తుత ధర రూ.184
ఏడాదిలో షేరు పెరుగుదల : (-7.4%)

ముడిచమురు ధరలు పెరుగుతుండడం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఉత్పత్తి పెరుగుతుండడం లాంటి సానుకూల అంశాల కారణంగా షేరు ధరకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. 

 

రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్
ప్రస్తుత ధర రూ.126.85 
ఏడాదిలో షేరు పెరుగుదల : (-23.8%)

15మంది దిగ్గజ మార్కెట్‌ పండితులలో 9మంది ఈ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు బ్లూమ్‌బర్గ్‌ పత్రిక ప్రచురించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 27.7 శాతం డివిడెండ్‌ పేఅవుట్‌ రేషియో నమోదయ్యే అవకాశం ఉందని ఎడిల్‌వీస్‌ సెక్యూరిటీస్‌ అంచనావేస్తోంది. రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 14-15 శాతం ఉంటే అవకాశం ఉందని భావిస్తోంది.

ఎన్‌టీపీసీ
ప్రస్తుత ధర రూ.170
ఏడాదిలో షేరు పెరుగుదల : (-6.7%)

ఈ షేరు టార్గెట్‌ ధరను రూ.213 వద్ద నిర్ణయించినట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. సామర్థ్యం పెంపు ట్రాక్ రికార్డు, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ కచ్చితంగా ఉండడం లాంటి సానుకూల అంశాల ఆధారంగా బై రేటింగ్‌ ఇచ్చినట్లు తెలియజేసింది.

ఇవి కేవలం మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

సెన్సెక్స్‌ మైనస్‌...నిఫ్టీ ప్లస్‌

Tuesday 13th March 2018

5శాతం పతనమైన టీసీఎస్‌ లాభపడ్డ పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ముంబై:- దేశీయ స్టాక్ మార్కెట్‌ చివరిగంటలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై..చివరకు దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది.  బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 61.16 పాయింట్ల నష్టంతో 33,856 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.45 పాయింట్ల లాభంతో 10,426.85 వద్ద ముగిసింది.  పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఫార్మా, మీడియా, మెటల్‌ రంగాల షేర్లు లాభాల్లో ముగియగా, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ షేర్లు

ఆటుపోట్ల మార్కెట్లో ఆదుకునే సిఫార్సులు!

Tuesday 13th March 2018

కాంట్రా బెట్‌ రికమండేషన్లు ప్రస్తుత ఒడిదుడుకుల మార్కెట్లో ఎంచుకోవాల్సిన కొన్ని టాప్‌ కాంట్రా షేర్లను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. కోటక్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు 1. ఇండో కౌంట్‌: యూఎస్‌లో బడా రిటైలర్ల డీస్టాకింగ్‌ ముగిసిపోనుండడం దేశీయ టెక్స్‌టైల్‌ ఎగుమతిదారులకు కలిసివచ్చే అంశం.  తదుపరి యూఎస్‌ రిటైలర్లు రీస్టాకింగ్‌ ఆరంభిస్తారు. దీంతో ఇండోకౌంట్‌లాంటి కంపెనీలకు మంచి లబ్ది చేకూరనుంది. 2. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌: ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చూపుతోంది. అయితే వచ్చే నాలుగేళ్లకు వెనక్కితిరిగి చూసే

Most from this category