News


ఇకపై మారుతి కన్నా హీరోనే మిన్న!

Wednesday 13th September 2017
Markets_main1505297057.png-8509

ముంబై: ఆటో మొబైల్‌ సెక్టార్‌లోని అగ్రగామి వెలుగొందున్న మారుతీసుజుకీ షేరును ఇదే రంగంలోని హీరో మోటోకార్ప్‌ షేరు రాబోయే కాలంలో అధిగమించనుందా..? అవుననే అంటున్నారు మార్కెట్‌ నిపుణులు. ఇప్పటివరకు మారుతీ సుజుకీ షేరు హీరో మోటోకార్ప్‌ కన్నా మెరుగైన ప్రదర్శన కనబరచింది. గత యేడాది కాలంలో హీరో మోటోకార్ప్‌ షేరు 29శాతం వృద్ది చెందగా, ఇదే సెక్టార్‌లోని మారుతీ సుజుకీ షేరు 49శాతం మాత్రమే వృద్ది చెందింది. గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం హీరో మోటోకార్ప్‌ షేరుపై బాగా ప్రభావాన్ని చూపింది. ఇదే సెక్టార్‌లో మారుతీ సుజుకీతో పాటు మిగతా కార్ల షేర్లపై పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఏమాత్రం ప్రభావాన్ని చూపలేదని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. దీంతో ఆటో రంగంలోనే ఉన్నా, హీరోమోటోకార్ప్‌ షేరు అనుకున్నంత మేర ప్రదర్శన చూపలేకపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే నోట్ల రద్దు ప్రభావం తగ్గిపోతుండడం, గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలకు డిమాండ్‌ పెరుగుతుండడం.. హీరోకు కలిసిరానున్న అంశాలని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే ఇప్పుడిప్పుడే హీరో షేరు మంచి జోరు చూపుతోంది. ఇదే ఊపు మరికొన్ని నెలలు కొనసాగుతుందని, ఆ సమయానికి మారుతీ సుజుకీ పరుగులను హీరో మోటోకార్ప్‌ దాటేస్తుందని ఆటోనిపుణులు అంచనా వేస్తున్నారు. 2018 ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌ ప్రకారం చూస్తే హీరో షేరు మారుతీ కన్నా 33 శాతం చౌకగా ట్రేడవుతోంది. 







You may be interested

ఇండియాలో షెల్‌ వాహన రీఛార్జీంగ్‌ స్టేషన్లు 

Wednesday 13th September 2017

భవిష్యత్ రవాణా వ్యవస్థ ఎలా ఉండబోతోందని ఊహించుకుంటే, హైపర్ లూప్ రవాణా మార్గాలు, బుల్లెట్ రైళ్లు మరియు సిటి రవాణా కోసం మెట్రో రైళ్లు అదే విధంగా వ్యక్తిగత ప్రయాణ అవసరాల కోసం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ టూ వీలర్లు మదిలో మెదులుతాయి.   మరి పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను తయారు చేసే కంపెనీల పరిస్థితి ఏమిటని చూస్తే, అవి కూడా ఎలక్ట్రిక్ కార్ల మీద

10,500 పాయింట్లకు నిఫ్టీ!

Wednesday 13th September 2017

అరిహంత్‌ కాపిటల్‌ అంచనా దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం పెరగడంతో దేశీయ మార్కెట్లు జోరుమీదున్నాయి. ప్రస్తుతానికి సూచీల వాల్యూషన్స్‌ గరిష్ఠాల వద్ద ఉన్నాయని చెప్పవచ్చు. కానీ వాల్యూషన్స్‌ ఎక్కువగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోవడంలేదు. ఈ సంవత్సరం ఎర్నింగ్స్‌ వృద్ధి కన్నా ప్రైస్‌ ఎర్నింగ్‌ మల్టిపుల్స్‌ విస్తరణకే ఎక్కువ అవకాశాలున్నాయి. సిమెంట్‌, కన్జూమర్‌ గూడ్స్‌, ఆటో, ఎన్‌బిఎఫ్‌సీ రంగాల్లో ఈ మార్పు చూడవచ్చు. తాజా రికవరీకి సంస్కరణలు, మెరుగుపడుతున్న

Most from this category