STOCKS

News


హీరో ప్యాషన్‌ ప్రో, ఎక్స్‌ప్రోలలో 2018 ఎడిషన్స్‌

Tuesday 13th March 2018
auto-mobiles_main1520960454.png-14634

  • ప్రారంభ ధర రూ.53,189

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’ తాజాగా 2018 ప్యాషన్‌ ప్రో, ప్యాషన్‌ ఎక్స్‌ప్రో మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.53,189, రూ.54,189గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. 100-110 సీసీ మోటార్‌సైకిల్‌ విభాగంలో మార్కెట్‌ వాటాను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ బైక్స్‌ను ఆవిష్కరించింది. వీటిల్లో బీఎస్‌-4 నిబంధనలకు అనువైన 110 సీసీ ఇంజిన్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఈ రెండు కొత్త వేరియంట్లలో హీరో ఐ3ఎస్‌ టెక్నాలజీని పొందుపరిచినట్లు పేర్కొంది. బైక్స్‌ ఆవిష్కరణ సందర్భంగా హీరో మోటొకార్ప్‌ హెడ్‌ (సేల్స్‌ అండ్‌ కస్టమర్‌ కేర్‌) అశోక్‌ భాసిన్‌ మాట్లాడుతూ.. దేశీ మోటార్‌సైకిల్‌ మార్కెట్‌లో 50 శాతానికిపైగా వాటాను కలిగి ఉన్నామన్నారు. ఇక 100-110 సీసీ విభాగంలో 75 శాతానికిపైగా మార్కెట్‌ వాటాతో దూసుకెళ్తున్నామని తెలిపారు. కాగా దేశంలో అత్యధికంగా విక్రయమౌతోన్న రెండో మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ ప్యాషన్‌. ఇక అగ్రస్థానాన్ని స్ల్పెండర్‌ బ్రాండ్‌ ఆక్రమించింది. 



You may be interested

బ్రాడ్‌కామ్‌ డీల్‌కు ట్రంప్ బ్రేకులు..

Tuesday 13th March 2018

 క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసే ప్రయత్నాలకు గండి  జాతీయ భద్రతా కారణాల సాకు  117 బిలియన్ డాలర్ల డీల్‌ వాషింగ్టన్‌: చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసేందుకు సింగపూర్‌ సంస్థ బ్రాడ్‌కామ్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఈ డీల్‌కు అనుమతివ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ క్వాల్‌కామ్‌ను గానీ బ్రాడ్‌కామ్ టేకోవర్ చేసిన పక్షంలో ఆ సంస్థ అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే విధమైన

ఎల్‌వోయూల జారీపై నిషేధం

Tuesday 13th March 2018

 ఆర్‌బీఐ ఆదేశం  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ స్కామ్ ప్రభావం ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ. 13,000 కోట్ల మేర లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌వోయూ) కుంభకోణం దరిమిలా రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు ఎల్‌వోయూలు జారీ చేయడాన్ని నిషేధించింది. వాణిజ్య రుణాలకు సంబంధించి బ్యాంకులు.. ఎల్‌వోయూలు, లెటర్స్ ఆఫ్ కంఫర్ట్‌ (ఎల్‌వోసీ)ల జారీ చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వివరించింది.

Most from this category