STOCKS

News


ఈ పరిస్థితుల్లో బఫెట్‌ సూత్రం.. తారకమంత్రం!

Tuesday 13th February 2018
Markets_main1518519647.png-13931

5నాన్స్‌ డాట్‌ కామ్‌ సీఈఓ దినేశ్‌రోహిరా సలహాలు
చాలా రోజుల బుల్‌ రన్‌ తర్వాత దేశీయ మార్కెట్లు అంతర్జాతీయ సూచీలను అనుసరిస్తూ భారీ పతనానికి గురైయ్యాయి. యుఎస్‌లో ద్రవ్యోల్బణ భయాలు, బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం, వడ్డీరేట్లపై భయాలు కరెక‌్షన్‌కు కారణాలయ్యాయి. తాజాగా దేశీయ సూచీల్లో వచ్చిన కరెక‌్షన్‌ ఎప్పటినుంచో మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తూ వాల్యూషన్ల కారణంగా దూరంగా ఉంటున్నవారికి మంచి అవకాశాన్నిస్తోందని దినేశ్‌ చెబుతున్నారు. ఈ సమయంలో వారెన్‌ బఫెట్‌ చెప్పిన కీలక సూత్రాన్ని పాటిస్తే పోర్టుఫోలియో కోట్లు కురిపిస్తుందంటున్నారు. ఒక కంపెనీ షేరును చౌక ధరల వద్ద కొనుగోలు చేసి, ఆ కంపెనీ తన సత్తా చాటే వరకు వేచిచూస్తే లాభాలు గ్యారెంటీ అన్నది బఫెట్‌ మాట. ఒకసారి షేర్లు కొన్నాక స్వల్పకాలిక ఒడిదుడుకులకు వెరువక ఓపికతో లాంగ్‌టర్మ్‌ వేచిచూడాలని ఆయన సూచిస్తారు. దీన్ని తప్పక పాటించాలని దినేశ్‌ చెబుతున్నారు. ప్రస్తుతం భారత ఫండమెంటల్స్‌ పటిష్ఠంగా మారి, త్వరలో ఎకానమీ మంచి వృద్ధి చవిచూసేందుకు సిద్ధంగా ఉన్నదని, అందువల్ల నాణ్యమైన కంపెనీల షేర్లను పోర్టుఫోలియోలో పెట్టుకొని సరైన సమయం వేచి చూడాలని దినేశ్‌ సలహా ఇస్తున్నారు. 2008, 2011లో జరిగినట్లు ప్రస్తుతం ఎకానమీల్లో సంక్షోభం వచ్చే పరిస్థితులు లేనందున ఈ సమయంలో బఫెట్‌ సూత్రాన్ని పాటించడం మంచిదని దినేశ్‌ అభిప్రాయపడ్డారు. నాణ్యమైన షేర్లను ఎంచుకొని కొనుగోలు చేసి కనీసం 3- 5 సంవత్సరాలు వేచిచూస్తే మంచి ఫలితాలుంటాయని ఆయన అంచనా. బుల్‌రన్‌లో ఉన్నప్పుడు వచ్చే స్వల్పకాలిక కరెక‌్షన్లు, కన్సాలిడేషన్లను మంచి స్టాకులు కూడబెట్టేందుకు అవకాశంగా భావించాలని, వీలుంటే యావరేజ్‌ చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. 



You may be interested

టెక్నాలజీలో దేశీ సంస్థల దూకుడు

Tuesday 13th February 2018

 డెల్‌ టెక్నాలజీస్‌ నివేదిక న్యూఢిల్లీ: టెక్నాలజీ వినియోగంలో దేశీ కంపెనీలు దూసుకెళుళతున్నాయి. ఇప్పటికే 38 శాతం భారతీయ కంపెనీలు..  ఉద్యోగులు, మెషీన్లు సమన్వయంతో పనిచేసేలా టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు సైతం ఈ స్థాయిని అందుకోవడానికి మరో రెండేళ్లు పట్టేయనుంది. డెల్‌ టెక్నాలజీస్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత సంస్థలు మరింత పరిణతి చెందాయని డెల్ ప్రెసిడెంట్ రాజేష్ జానే తెలిపారు.

10025 పాయింట్లే చివరి ఆశ!

Tuesday 13th February 2018

నిఫ్టీపై పట్టుకు బుల్స్‌కు ఇదే గట్టి మద్దతు రెండువారాలుగా అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న కరెక‌్షన్‌ దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలవుతున్నారు. నిజానికి ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్‌ కాస్తమేర నయమనిపించేలా ఉంది. నిఫ్టీ ఆల్‌టైమ్‌ హై నుంచి దాదాపు 6 శాతం పతనమైంది. బడ్జెట్‌ నుంచి కేవలం డీఐఐలు మాత్రమే నికర కొనుగోలుదారులుగా మారాయి. ఎఫ్‌ఐఐలు, రిటైలర్లు నికరంగా అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌ కొనసాగాలంటే తిరిగి మార్కెట్‌పై

Most from this category