STOCKS

News


‘ఫండంటి’ బహుమతివ్వండి!

Monday 19th March 2018
personal-finance_main1521438635.png-14788

- నేరుగా ఫండ్స్‌ను గిఫ్ట్‌ ఇచ్చే అవకాశం లేదు
- కానీ ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయ్‌
- ఎస్‌బీఐ బంధన్‌ ప్లాన్‌ అయితే క్రమంగా విత్‌డ్రా
- అందుబాటులో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ చిల్డ్రన్‌ ప్లాన్లు
- కుటుంబ సభ్యులకు ఏ రూపంలో ఇచ్చినా పన్ను లేదు
- లాభాలపై మాత్రం తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిందే


స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్లకు ఆదరణ పెరుగుతుండటంతో ఇటీవలి కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ చాలా ప్రాధానం సంతరించుకున్నాయి. పొదుపుతో పాటు మంచి రాబడికి చక్కని సాధనాలుగా నిరూపించుకున్నాయి. అందుకే ఏటేటా ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడుల్లో అనూహ్యమైన వృద్ధి కనిపిస్తోంది. ఈ పరిస్థితులు చూసి చాలా మందికి ఫం‍డ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనిపిస్తోంది. వాటిని కుటుంబ సభ్యులకు కానుకగా ఇవ్వాలని కూడా కొందరు ఆశపడుతుంటారు. కాకపోతే ఇందుకు నిబంధనలు అనుమతించవు. అయినప్పటికీ ఫండ్స్‌ యూనిట్లను కానుకగా ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలియజేసే కథనమే ఇది. 
--
బహుమతి అంటూ మీ బ్యాంకు ఖాతా నుంచి మీ జీవిత భాగస్వామి పేరిట నేరుగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయటానికి నిబంధనలు అంగీకరించవు. ఎందుకంటే మ్యూచ్‌వల్‌ ఫండ్‌ సంస్థలు థర్డ్‌ పార్టీ పేమెంట్లను అనుమతించవు. అంటే! ఎవరి పేరిట కొంటారో వారి ఖాతా నుంచే నగదు చెల్లింపులు జరగాలి. ఒకవేళ మీ పేరిట మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి... కాల వ్యవధి ముగిశాక మీ జీవిత భాగస్వామి పేరిట ఫండ్‌ యూనిట్లను బదిలీ చేయటానికి కూడా అవకాశం లేదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎవరి పేరిట ఉంటాయో వారు గనక మరణించిన పక్షంలో మాత్రం ఆ యూనిట్లను వారసులకు బదిలీ చేసే అవకాశముంది. 
ఇలాంటి పరిస్థితుల్లో ఫండ్స్‌ యూనిట్లను కానుకగా ఇవ్వాలంటే మీ ముందున్న ఆప్షన్‌... 
1. మీ పేరిట ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లి కాల వ్యవధి తీరాక రిడెంప్షన్‌ చేసుకుని... నగదు బ్యాంకులో జమయిన అనంతరం మీ జీవిత భాగస్వామికి కానుకగా ఇవ్వడమే. 
2. మీ జీవిత భాగస్వామి బ్యాంకు ఖాతాకు ప్రతి నెలా పెట్టుబడి మొత్తాన్ని తరలిస్తూ వారి పేరిట మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.
నిజానికి ఈ రెండు మార్గాలూ అంత ఆకర్షణీయంగా అనిపించకపోవచ్చు. అందుకని అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఇలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పథకాలను అందిస్తున్నాయి. వీటిలో చిల్డ్రన్స్‌ పేరిట హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్స్‌ గిఫ్ట్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చైల్డ్‌కేర్‌ తదితర పథకాలను పరిశీలించొచ్చు. ఈ పథకాలు చాలా కాలంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నవే. తమ పిల్లల పేరిట పెట్టుబడులకు అవకాశం కల్పించే గిఫ్ట్‌ పథకాలు ఇవి. 
విభిన్న ఆప్షన్లు...
ఈ తరహా పథకాలు కొన్నింటిలో లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే చిన్నారులకు 18 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడుల ఉపసంహరణకు వీలుండదు. పిల్లల ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడాలన్నదే ఈ లాకిన్‌ పీరియడ్‌ ఉద్దేశం. అయితే, లాకిన్‌ పీరియడ్‌ లేకుండా ఎంచుకునే ఆప్షన్‌ కూడా ఉంది. ఇన్వెస్ట్‌ చేసే ముందే కంపెనీని ఈ విషయమై విచారించాలి. ఇక ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఇటీవలే బంధన్‌ పేరిట సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయిల్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. మ్యూచువల్‌ ఫండ్‌ను కానుకగా ఇవ్వాలనుకునే వారికి ఇది చక్కగా సరిపోతుంది. బంధన్‌ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌లో చేరిన వారు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఇన్వెస్టర్‌ కుటుంబంలో ఒకరికి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ చెల్లింపులు చేస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం... ఎంచుకున్న పథకం... దానిపై వచ్చే రాబడుల ఆధారంగా చెల్లించే మొత్తం ఆధారపడి ఉంటుంది. నిర్ణీత తేదీన బ్యాంకు ఖాతాలో ఆ మొత్తం జమవుతుంది.
పన్నులు కూడా వర్తిస్తాయి...
మరొకరికి కానుకగా ఇవ్వడం అంటే ఒకరు చెల్లిస్తే మరొకరు ప్రయోజనం పొందడం. కాబట్టి ఇది పన్ను పరిధిలోకి వస్తుందో లేదో చూద్దాం...
1. ఆదాయపన్ను చట్టం ప్రకారం బంధువు నుంచి బహుమతి పొందితే దానిపై పన్ను ఉండదు. బంధువులు అన్నదానికి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, తోడబుట్టిన వారు, జీవిత భాగస్వామికి తోడబుట్టిన వారు, తల్లిదండ్రులకు తోడబుట్టిన వారు అని చట్టం చెబుతోంది. ఇవే నిబంధనలు మైనర్‌ లబ్ధిదారులకూ వర్తిస్తాయి. 
2. బహుమతిపై పన్ను లేకపోయినప్పటికీ... డెట్‌, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలపై స్వల్ప, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులంటూ ఉన్నాయి. వీటిని చెల్లించడం తప్పనిసరి. 
3. ఒకవేళ మీ జీవిత భాగస్వామి బ్యాంకు ఖాతాకు మీరు ప్రతి నెలా పెట్టుబడుల మొత్తం బదలాయించి ఆమె లేదా అతని పేరిట ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు అయితే లాభాలపై పన్నును నిబంధనల మేరకు లబ్ధిదారే చెల్లించాలి. 
4. ఒకవేళ మీ పేరిటే ఇన్వెస్ట్‌ చేసి కాల వ్యవధి తీరిన తర్వాత వెనక్కి తీసుకుని అప్పుడు ఆ మొత్తాన్ని కానుకగా ఇచ్చినట్టయితే గడించిన లాభంపై మీరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
5. మీ చిన్నారుల పేరిట మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. ఒకవేళ చిన్నారి మైనారిటీ తీరకముందే ఆ పెట్టుబడుల కాల వ్యవధి ముగిసిపోతే ఆ ఆదాయాన్ని పేరెంట్‌ ఆదాయంలో కలిపి చూపించాల్సి ఉంటుంది. 

ఆదాయపన్ను చట్టంలోని నిబంధన ప్రకారం క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ అన్నది బదిలీ చేసే వ్యక్తికి సంబంధించినదని నాంజియా అండ్‌ కో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నేహ మల్హోత్రా చెప్పారు. ఈ విధంగా బదిలీ చేసిన వారు అవసరమైతే దాన్ని రద్దు చేసుకునే హక్కును కూడా కలిగి ఉంటారని ఆమె తెలియజేశారు. ఇక ఎస్‌బీఐ బంధన్‌ ప్లాన్‌లోనూ పెట్టుబడులు పెట్టేవారు కూడా వారే పన్ను చెల్లించాల్సి ఉంటుందని క్లియర్‌ ట్యాక్స్‌ సీఈవో అర్చిత్‌ గుప్తా తెలిపారు. You may be interested

మీ డివిడెండ్‌ మీకు చేరిందా?

Monday 19th March 2018

- లేదంటే కంపెనీ దగ్గరే ఉండి ఉంటుంది - వివరాలు కంపెనీ వెబ్‌సైట్లో ఉంటాయి - ఏడేళ్ల వరకూ కంపెనీ డివిడెండ్‌ ఖాతాలోనే - ఆ తర్వాత ఇన్వెస్టర్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌కు బదిలీ - ఈ లోపు ఎప్పుడైనా క్లెయిమ్‌ చేసుకోవచ్చు వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగించే కంపెనీలన్నీ దాదాపుగా తమ వాటాదాలకు ఏటా కొంత లాభాన్ని డివిడెండ్‌ రూపంలో పంపిణీ చేస్తుంటాయి. కొన్ని కంపెనీలు ప్రతి మూడు నెలలకూ ఎంతో కొంత డివిడెండ్‌ చెల్లిస్తాయి కూడా.

పసిడికి కీలకం... ఈ వారం ఫెడ్‌ నిర్ణయం!

Monday 19th March 2018

వారంలో పది డాలర్లు పతనం 1,314 డాలర్ల వద్ద ముగింపు పెరుగుదలపై మిశ్రమ స్పందనలు... అంతర్జాతీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌- నైమెక్స్‌లో  వారంలో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) 10 డాలర్లు తగ్గి 1,314 డాలర్ల వద్ద ముగిసింది. ఇదే వారంలో డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా ఎగసి 90.11 నుంచి 90.17కు చేరింది. 1,360 డాలర్లను తాకిన పసిడి నాలుగు వారాలుగా తగ్గుతూ వస్తోంది.  అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌- ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేటుకు సంబంధించి బుధవారం తీసుకునే

Most from this category