STOCKS

News


రూ.5,000 సిప్‌తో కోటీశ్వరులు!

Tuesday 13th March 2018
Markets_main1520942580.png-14626

ఇటీవలి మార్కెట్లో అస్థిరతలు చూసి ఆందోళన చెందుతున్నారా...? రికార్డు గరిష్టాలకు చేరిన తర్వాత నుంచి సూచీలు కరెక్షన్‌ బాట పట్టాయి. గత రెండు రోజుల్లో మార్కెట్లో కొంత కోలుకున్నాయి. అయినా, ఈ విధమైన ప్రయాణాలు చూసిన తర్వాత సహజంగానే కొత్త ఇన్వెస్టర్లలో ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చి పడుతున్న నిధులతో ఇటీవలి కాలంలో మన మార్కెట్లకు కొంత స్థిరత్వం వచ్చిన మాట నిజమే. ఫిబ్రవరిలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను మినహాయించి చూస్తే ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.14,683 కోట్లు కావడం గమనార్హం. మార్కెట్ల అస్థిరతల నేపథ్యంలో నేరుగా రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేని వారే మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు మళ్లుతున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

‘‘కరెక్షన్లు మార్కెట్లలో ఓ భాగం. దానిపై అంతగా దృష్టి సారించరాదు. రోజువారీ మార్కెట్లను గమనిస్తూ పోర్ట్‌ఫోలియోను గమనిస్తుండే వారు దానికి బదులు మీ లక్ష్యాలకు అనుగుణంగా తగిన ఈక్విటీ పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయడం మంచిది’’ అని సూచించారు యూటీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఈవీసీ స్వాతి కులకర్ణి. ఫిబ్రవరి నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.22.2 లక్షల కోట్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు కేటాయింపులు పెంచుకోవచ్చని స్వాతి కులకర్ణి సూచిస్తున్నారు. ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలంలో అధిక సంపద సమకూర్చుకునే అవకాశాలున్నాయని ఆమె వివరించారు. ‘‘దీర్ఘకాలంలో సంపద సృష్టించుకోవాలంటే ఇన్వెస్టర్లు ప్రతీ నెలా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు 25ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. కాస్తంత అధిక రాబడులను ఆశించే వారు ప్రతీ నెలా రూ.5,000ను 12శాతం రాబడినిచ్చే ఈక్విటీ ఫండ్స్‌లో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తే సమకూరే మొత్తం రూ.93.9 లక్షలు. మరో రూ.5,000ను ప్రతీ నెలా 10 శాతం రాబడినిచ్చే పథకంలో 25 ఏళ్ల పాటు పెట్టబడి పెడితే రూ.66 లక్షలు అవుతుంది’’ అని స్వాతి కులకర్ణి చెప్పారు. 



You may be interested

మన మార్కెట్లపై శంకర్‌శర్మ విశ్లేషణ

Tuesday 13th March 2018

భారత ఈక్విటీ మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లలో బుల్‌ర్యాలీ ఇంకా ముగిసి పోలేదంటున్నారు ఫస్ట్‌గ్లోబల్‌ సంస్థ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌, జాయింట్‌ ఎండీ శంకర్‌శర్మ. ముఖ్యంగా మన మార్కెట్లలో స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ అధిక రాబడులను ఇస్తాయంటున్నారు. 2014 నుంచి సెన్సెక్స్‌ 12.5 శాతం రాబడులు ఇస్తే, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వార్షికంగా 45శాతం రాబడులను అందించిన విషయం గమనార్హం. ఈ తరహా రాబడులు దేశ చరిత్రలో ముందెన్నడూ లేవని, ఇదే ఇక ముందూ

సాంక్టమ్‌ వెల్త్‌ నుంచి టెక్నికల్‌ రికమండేషన్లు

Tuesday 13th March 2018

1. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1200. స్టాప్‌లాస్‌ రూ. 1060. ఇటీవలే సుదీర్ఘ కన్సాలిడేషన్‌ నుంచి బయటకు వచ్చింది. తాజాగా డైలీ చార్టుల్లో బుల్లిష్‌ ఫ్లాగ్‌ ఏర్పరిచింది. హయ్యర్‌ లోను ప్రతిరోజు ఏర్పరచడం కిందస్థాయిలో కొనుగోళ్లకు చిహ్నం. స్టొకాస్టిక్స్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.  2. కేపీఐటీ టెక్‌: కొనొచ్చు.  టార్గెట్‌ రూ. 260. స్టాప్‌లాస్‌ రూ. 205. నెలవారీ చార్టుల్లో డబ్ల్యు ఆకార పాటర్న్‌ను ఏర్పరిచింది.

Most from this category