STOCKS

News


చెత్తను కొంటాం.. ఆన్‌లైన్‌లో!

Friday 1st September 2017
startups_main1504286068.png-7903

ఒకటేమో చెత్తను ఆన్‌లైన్లో కొనుగోలు చేసే కంపెనీ. మరొకటేమో పాత మొబైల్‌ ఫోన్లకు కూడా చక్కని యాక్సెసరీస్‌ను విక్రయించే కంపెనీ. రెండింటి ఆలోచనలూ వినూత్నమే. ‘సాక్షి’ స్టార్టప్‌ డైరీకి వస్తున్న మెయిల్స్‌ నుంచి ఈ రెండూ మీ కోసం...
హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో;

చెత్తను కొంటాం.. ఆన్‌లైన్‌లో!

పాత పేపర్లు అమ్మే వ్యక్తి వస్తే గానీ ఇంట్లో చెత్త తరగదు!!. కొట్టుకెళ్లి అమ్మితే గానీ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలూ కదలవు!!. రెండూ కష్టమైన పనులే. మరి ఒక్క క్లిక్‌తో ఆ సమస్య తీరిపోతే? ఆ వెసలుబాటునే వ్యాపారంగా మార్చుకున్నారు ఇద్దరు స్నేహితులు. హలోడస్ట్‌బిన్‌.కామ్‌ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ వసంత్‌ రెడ్డి మాటల్లోనే..

  •  నేను, రాజమహేంద్ర రెడ్డి ఇద్దరం ఉస్మానియా వర్సిటీ నుంచి స్నేహితులం. చదువులో భాగంగా మేం ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లపై చేసిన ప్రాజెక్ట్‌ వర్కే చదువు పూర్తయ్యాక మాకు వ్యాపార వేదికయింది. చెత్త సేకరణ, పునఃవినియోగంపై పరిశోధన చేసి రూ.15 లక్షల పెట్టుబడితో 2016 మేలో హలోడస్ట్‌బిన్‌.కామ్‌ను ప్రారంభించాం.
  •  పాత పేపర్లు, మ్యాగజైన్లు, స్క్రాప్, అల్యూమినియం, పుస్తకాలు ఏవైనా సరే కిలోల చొప్పున కొంటాం. ఇళ్లతో పాటు సొసైటీలు, పరిశ్రమలు, కంపెనీల నుంచి కూడా ఈ–ప్లాస్టిక్, పాత ఇనుము తీసుకుంటాం. ధరలు కిలోకు పేపర్‌కు రూ.7, ప్లాస్టిక్, ఈ–వేస్ట్‌లకు రూ.8, టిన్నులు రూ.6, ఇనుముకు రూ.12 ఉంటాయి.
  •  యాప్‌ ద్వారా గానీ వెబ్‌సైట్‌ ద్వారా గానీ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసి గానీ మా సేవలను వినియోగించుకోవచ్చు. ఆర్డర్‌ రాగానే డిజిటల్‌ వెయింగ్‌ మిషన్, వాహనం వెంట తీసుకెళతాం. ప్రస్తుతం రోజుకు టన్ను చెత్తను కొంటున్నాం. మేం సేకరించిన చెత్తను రీసైక్లింగ్‌ కంపెనీలకు విక్రయిస్తాం. హైదరాబాద్‌కు చెందిన 10 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం.
  •  ప్రస్తుతం 10 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 500 టన్నుల చెత్తను కొన్నాం. ఏడాదిలో రూ.10 లక్షల టర్నోవర్‌ నమోదు చేశాం. డబ్బులు నేరుగా ఇవ్వకుండా హలోడస్ట్‌బిన్‌.కామ్‌ వాలెట్‌లో వేస్తాం. దీని ద్వారా మాతో ఒప్పందం చేసుకున్న పలు సూపర్‌ మార్కెట్లలో షాపింగ్‌ చేసుకోవచ్చు.

పాత ఫోన్ల యాక్ససరీలూ ఉంటాయిక్కడ!
విపణిలోకి కొత్తగా వచ్చిన సెల్‌ఫోన్ల యాక్ససరీలు దొరకడం పెద్దగా కష్టం కాదు.కానీ, ఐదు, పదేళ్ల కిందటి ఫోన్ల యాక్ససరీలు కొనాలంటే చాలా కష్టం. ఒక్కోసారి దొరకవు కూడా. కానీ, డయల్‌ మామలో వెతికితే దొరికేస్తాయి. పదేళ్ల కిందటివే కాదు. తొట్టతొలి మోడల్‌ మొబైల్‌ యాక్ససరీలూ దొరుకుతాయిక్కడ. ఇదే తమ ప్రత్యేకత అంటున్నారు డయల్‌ మామ కో–ఫౌండర్‌ ఎం.హర్షవర్ధన్‌ రెడ్డి. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

  •  నేను, స్నేహితుడు కిరణ్‌ కుమార్‌ కలిసి 2014 డిసెంబర్‌లో అమీర్‌పేట కేంద్రంగా డయల్‌ మామా మొబైల్‌ సొల్యూషన్స్‌ను ఆరంభించాం. ఇప్పటివరకు రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. రిటైలర్లకు మాత్రమే మొబైల్‌ యాక్సెసరీలు విక్రయిస్తాం. రూ.5 వేల లోపు సెల్‌ఫోన్లనూ విక్రయిస్తాం. 
  •  సెల్‌ఫోన్‌ ఫ్లిప్‌ కవర్స్, బ్యాటరీలు, చార్జర్ల వంటి 4 వేల కేటగిరీల్లో సుమారు 1.75 లక్షల యాక్ససరీలున్నాయి. వీటిని ముంబై నుంచి దిగుమతి చేసుకుంటాం. దీనికోసం 450 మంది డీలర్లతో ఒప్పందం చేసుకున్నాం. తెలంగాణ, ఏపీల్లో 20 వేల మంది రిటైలర్లున్నారు. ఇందులో 1250 మంది యాక్టివ్‌ రిటైలర్లు కస్టమర్లుగా ఉన్నారు.
  •  ప్రస్తుతం రోజుకు లక్ష రూపాయల వరకు ఆర్డర్లొస్తున్నాయి. యాక్సెసరీలను సనత్‌నగర్‌లోని గోడౌన్‌లో నిల్వ చేస్తాం. ఆర్డర్‌ రాగానే ఇక్కడి నుంచే ప్యాకేజింగ్‌ చేసి... 3 రోజుల్లో డెలివరీ చేస్తాం. ఇందుకు ప్రధాన కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం.
  •  ప్రస్తుతం 13 మంది ఉద్యోగులున్నారు. జనవరి నాటికి కనీసం 5 వేల మంది రిటైలర్లకు రూ.25 కోట్ల వ్యాపారానికి చేరుకోవాలని లక్ష్యించాం. త్వరలోనే వ్యక్తిగత కస్టమర్లకు సేవలందించేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా కూడా నగదును పంపించే వీలుంది.You may be interested

హింద్‌కాపర్‌ సీఎండీగా సంతోష్‌ శర్మ బాధ్యతల స్వీకరణ

Friday 1st September 2017

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ కాపర్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సంతోష్‌ శర్మ బాధ్యతలు స్వీకరించారు. 2017 సెప్టెంబర్‌ 1న సంతోష్‌ శర్మ హిందుస్తాన్‌ కాపర్‌ సీఎండీగా బాధ్యతలు చేపట్టారని సంస్థ బీఎస్‌ఈకి తెలియజేసింది. ఈయన ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. సంతోష్‌ శర్మ ఇప్పటిదాకా సంస్థ డైరెక్టర్‌గా (ఆపరేషన్స్‌) బాధ్యతలు నిర్వహించారు. సీఎండీగా బాధ్యతల స్వీకరణతో ఆ పదవి ఖాళీ అయ్యింది. కాగా సంతోష్‌ శర్మ తాజాగా కె.డి.

వృద్ధి అంచనాలు కట్‌..!

Friday 1st September 2017

 పూర్తి ఏడాదికి 7 శాతం దిగువనే...  అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థల తాజా అంచనా...  క్యూ1లో మూడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి నేపథ్యం...  ఆర్‌బీఐ మరోవిడత రేట్ల కోతకు ఆస్కారం... ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అనూహ్యరీతిలో మూడేళ్ల కనిష్టానికి పడిపోవడం పట్ల అంతార్జాతీయ ఆర్థిక నిపుణులు, విదేశీ బ్రోకరేజి దిగ్గజాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత పూర్తి ఆర్తిక సంవత్సరం(2017-18)లో ప్రభుత్వం లెక్కలేస్తున్న 7 శాతానికి చాలా దిగువనే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)

Most from this category