News


ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి హార్ట్‌/ క్యాన్సర్ ప్రొటెక్ట్ ప్లాన్‌ ..

Sunday 16th July 2017
personal-finance_main1500200443.png-5473

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సంస్థ .. ఐసీఐసీఐ ప్రు హార్ట్‌/ క్యాన్సర్ ప్రొటెక్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గుండె జబ్బు లేదా క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిన పక్షంలో బీమా కవరేజీలో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కంపెనీ అందజేస్తుంది. సరైన చోట సరైన చికిత్స పొందేందుకు ఇది ఉపయోగపడగలదని కంపెనీ ఈడీ పునీత్ నందా తెలిపారు. ఇన్‌కం రిప్లేస్‌మెంట్ పేరిట ప్రత్యేక యాడ్ఆన్ బెనిఫిట్ కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బీమా కవరేజీలో 1 శాతం మేర ప్రతి నెలా పాలసీదారుకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. చికిత్స చేయించుకుంటున్న సమయంలో పాలసీదారు కోల్పోయే ఆదాయాన్ని ఇది కొంత మేర భర్తీ చేయగలదని నందా వివరించారు. అత్యంత చౌకగా నెలకు రూ. 100కే రూ. 20 లక్షల పైగా క్యాన్సర్‌ కవరేజీ, రూ. 10 లక్షల హార్ట్ కవరేజీ పొందవచ్చు (సిగరెట్ అలవాటు లేని 30 ఏళ్ల వ్యక్తి, 20 ఏళ్ల వ్యవధికి పాలసీ తీసుకుంటే). క్యాన్సర్ లేదా హృద్రోగం ఉందని పరీక్షల్లో తేలితే భవిష్యత్‌లో ప్రీమియంలు కట్టకపోయినా పాలసీ కొనసాగుతుంది. క్యాన్సర్ లేదా హార్ట్‌ లేదా రెండింటికీ కలిపి కవరేజీ తీసుకునే వెసులుబాటు ఉంది. 







You may be interested

ఐటీ రిటర్నులు వేస్తున్నారా

Sunday 16th July 2017

 గడువు ఈ నెల 31; ఆ లోపే వేస్తే మంచిది - రిటర్నులో తప్పులు లేకుండా చూసుకోవాలి - నోట్ల రద్దు తరవాత డిపాజిట్లు చేస్తే దాచొద్దు - ఆధార్‌తో పాన్‌ అనుసంధానం తప్పనిసరి - ఆదాయాన్ని బట్టి వివిధ రకాల రిటర్ను పత్రాలు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) ఆదాయపు పన్ను చెల్లించినా... లేక మినహాయింపులకు లోబడి పన్ను తప్పించుకున్నా... ఎవరైనా సరే!! ఆదాయపన్ను పరిధిలోకి వచ్చే వారంతా ఏటా రిటర్నులు వెయ్యటం చట్ట ప్రకారం తప్పనిసరి.

బజాజ్ అలయంజ్ లైఫ్ నుంచి ఫ్యూచర్ వెల్త్ గెయిన్‌ పాలసీ

Sunday 16th July 2017

ప్రైవేట్ బీమా దిగ్గజ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా బజాజ్ అలయింజ్‌ లైఫ్ ఫ్యూచర్ వెల్త్ గెయిన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. యూనిట్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పథకంలో 'వెల్త్ ప్లస్', 'వెల్త్ ప్లస్ కేర్'  పేరిట రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకవైపు పాలసీదారు కుటుంబానికి బీమా రక్షణ కల్పిస్తూనే మరోవైపు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా సంపదను మరింతగా పెంచగలిగే విధంగాఈ పథకాన్ని రూపొందించారు. పాలసీదారు

Most from this category