STOCKS

News


నిధుల సమీకరణకు హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు ఆమోదం

Saturday 13th January 2018
Markets_main1515828828.png-13107

ముంబై:- ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ రూ.13వేల కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫ్రిపరెన్షియల్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.11వేలకోట్లను, క్యూఐపీ ప్రక్రియ ద్వారా మరో రూ.2వేల కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజాలైన వేవర్లీ(జీఐసీ), ఓమేర్స్‌ కెనడా, సిల్వర్‌వ్యూ ఇన్వెస్ట్‌మెంట్స్‌(కేకేఆర్‌), కార్మిగ్నాక్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌, అజీం ప్రేమ్‌జీ ఫండ్స్‌ కంపెనీలకు 6.4కోట్ల ఈక్విటీ షేర్లను ఫ్రిపరెన్షియల్‌ పద్దతిలో విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ పద్ధతిలో ప్రతి ఈక్విటీ షేరు ధరను 1,726.05లుగా నిర్ణయించింది. అలాగే, అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్యూఐపీ) ద్వారా మరో 2వేల కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. సమీకరించిన మొత్తం నిధుల్లో రూ.8,500 కోట్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 21 శాతం వాటాను నిలుపుకునేందుకే వినియోగిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. 2015 ఫిబ్రవరిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.9,800 కోట్ల క్యూఐపీ ఇష్యూతో అందులో హెచ్‌డీఎఫ్‌సీ వాటా దాదాపు 24 శాతం నుంచి 21.01 శాతానికి పడిపోయింది.
దశాబ్దకాలం తర్వాత:-
దాదపు దశాబ్దకాలం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 2007లో చివరిసారిగా ఈక్విటీ నిధుల సమీకరణకు దిగిన హెచ్‌డీఎఫ్‌సీ.. అంతకుముందు 1994, 1987లో రెండుసార్లు నిధులను సమీకరిచింది.



You may be interested

రూ.8,000 కోట్లు దాటిన అన్‌క్లెయిమ్డ్ బ్యాంకు డిపాజిట్లు

Saturday 13th January 2018

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు (ఈ సొమ్ము నాదీ అని ఎవ్వరూ క్లెయిమ్ చేయనటు వంటి మొత్తం) గడిచిన నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపైపోయాయి. 2016 డిసెంబర్‌ 31 నాటికి ఈ మొత్తం ఏకంగా రూ.8,864.6 కోట్లుగా ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. దేశావ్యాప్తంగా మొత్తం 2.63 కోట్ల అకౌంట్లలో ఈ సొమ్ము ఉన్నట్లు వెల్లడించింది. ఒకవైపు బ్యాంకులు కేవైసీ ఫామ్‌లను తీసుకోవాలని, ఎవరి సొమ్ము ఎంత ఉందనే

కళ తప్పని.. ఆఫీస్‌ మార్కెట్‌!

Saturday 13th January 2018

సాక్షి, హైదరాబాద్‌: 2017 ద్వితీయార్థంలో నగరంలో కార్యాలయాల స్థలానికి ఊపొచ్చింది. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటు ధర, విస్తృతమైన ఉద్యోగ, వ్యాపార అవకాశాలే కారణమని ఓ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. ఐటీ హబ్‌గా పేరొందిన దక్షిణ ప్రాంతమే కాకుండా ఓఆర్‌ఆర్, రేడియల్‌ రోడ్లు, మెట్రో రైలు పరుగులతో పోచారం, ఆదిభట్ల వంటి తూర్పు ప్రాంతాలకూ గిరాకీ పెరిగింది.  2017 ద్వితీయార్థంలో 3.34 మిలియన్‌ చ.అ. ఆఫీసు లావాదేవీలు జరిగాయి.

Most from this category