STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీలో 4 శాతం వాటా విక్రయం

Tuesday 13th March 2018
news_main1520960884.png-14639

  • ఐపీఓ ద్వారా విక్రయించనున్న హెచ్‌డీఎఫ్‌సీ 

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎమ్‌సీ)లో 4 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా విక్రయించనున్నది. హెచ్‌డీఎఫ్‌సీ డైరెక్టర్ల బోర్డ్‌ నియమించిన డైరెక్టర్ల కమిటీ ఈ వాటా విక్రయానికి ఆమోదం తెలిపిందని హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఒక్కొక్కటి రూ.5 విలువ గల 4.08 శాతం వాటాకు సమానమైన 85,92,970 షేర్లను ఐపీఓ ద్వారా విక్రయించనున్నామని పేర్కొంది. 

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఐపీఓకు గత ఏడాది నవంబర్‌లోనే హెచ్‌డీఎఫ్‌సీ ఆమోదం తెలిపింది. గత ఏడాది మార్చి నాటికి హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీలో హెచ్‌డీఎఫ్‌సీకి 59.99 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ నాటికి ఈ వాటా 57.36 శాతానికి తగ్గింది. ఒకటి లేదా వివిధ దఫాలుగా వాటా విక్రయం ద్వారా ఈ వాటాను కనీసం 50.01 శాతానికి తగ్గించుకోవాలని హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణయించింది. ఐపీఓ తర్వాత కూడా తమ అనుబంధ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ ఏఏమ్‌సీ కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌డీఎఫ్‌సీ  ఏఎమ్‌సీ రూ.1,588 కోట్ల ఆదాయంపై రూ.550 కోట్ల నికర లాభాన్ని సాధించింది. 
 



You may be interested

ఎస్‌బీఐ కనీస బ్యాలెన్స్ చార్జీల తగ్గింపు

Tuesday 13th March 2018

 75 శాతం మేర తగ్గుదల  ఇకపై నగరాల్లో నెలకు రూ. 15, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10  ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ముంబై: ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కనీస బ్యాలెన్స్ పెనాల్టీ చార్జీలను 75 శాతం మేర తగ్గించింది. దీంతో ఇకపై నగరాల్లో నెలకు సగటు బ్యాలెన్స్ పరిమితులను పాటించని పక్షంలో రూ. 15 (పన్నులు అదనం), సెమీ అర్బన్‌

వేదాంత బోర్డులోకి యూకే సిన్హా

Tuesday 13th March 2018

స్వతంత్ర డైరెక్టర్‌గా నియామకం న్యూఢిల్లీ: మైనింగ్‌ దిగ్గజం వేదాంత తాజాగా యూకే సిన్హాను కంపెనీ బోర్డులోకి తీసుకుంది. ఈయన అదనపు నాన్‌ఎగ్జిక్యూటివ్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. యూకే సిన్హా 2021 ఆగస్ట్‌ 10 వరకు పదవిలో కొనసాగుతారని వేదాంత బీఎస్‌ఈకి తెలిపింది. ‍కాగా యూకే సిన్హా 2011 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌గా పనిచేశారు. ఇక సెబీలోకి వెళ్లకముందు యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌

Most from this category