News


ఐపీవో యోచనలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్

Tuesday 18th July 2017
Markets_main1500321870.png-5539

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ తాజాగా ఐపీవోకి రావాలని నిర్ణయించింది. నియంత్రణ సంస్థల నుంచి అనుమతి ఇంకా రాకపోవడంతో మ్యాక్స్ లైఫ్‌తో విలీన ప్రతిపాదనను ప్రస్తుతం పక్కకు పెట్టాలని భావిస్తోంది. సోమవారం సమావేశమైన హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ బోర్డు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పెయిడప్‌ క్యాపిటల్‌లో గరిష్టంగా 20 శాతం వాటాలను ఆఫర్‌ ఫర్ సేల్ రూపంలో ఐపీవో కింద విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు కంపెనీ తెలిపింది. ఈలోగా ఒకవేళ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు లభించిన పక్షంలో మ్యాక్స్ లైఫ్‌ విలీన అంశాన్ని పునఃపరిశీలించగలమని పేర్కొంది. పబ్లిక్ ఇష్యూకి వస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్ లైఫ్‌ పరస్పరం ఆమోదయోగ్యమైన నిష్పత్తిలో వాటాలను విక్రయించనున్నాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి కంపెనీ పెయిడప్ షేర్ క్యాపిటల్ రూ. 2,190 కోట్లుగా ఉంది. సంస్థ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 91,740 కోట్లుగా ఉంది. మరోవైపు, మ్యాక్స్‌ లైఫ్‌తో విలీనానికి ఆమోదముద్ర లభించిన పక్షంలో ఇరు కంపెనీలకు మరింత ప్రయోజనం చేకూరగలదని కంపెనీ వర్గాలు తెలిపాయి. 







You may be interested

రేడియోను వెనక్కినెట్టేసిన మొబైల్‌!

Tuesday 18th July 2017

 2021 నాటికి మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ 34.8 బిలియన్‌ డాలర్లకు  మొత్తం ప్రకటనల వ్యయంలో టీవీ, ప్రింట్‌ వాటానే 76.2 శాతం  గతేడాది మూడో స్థానంలో రేడియో; ప్రస్తుతం ఈ స్థానంలో మొబైల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 2021 నాటికి దేశీయ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ ఏటా 11.8 శాతం వృద్ధితో 34.8 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 నాటికి అన్ని విభాగాల్లో కలిపి ప్రకటనల వ్యయం

కరెన్సీకి 'మేకిన్ ఇండియా' భద్రతా ఫీచర్లు

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి మరింతగా ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్‌ సోమవారం కరెన్సీ భద్రత ఫీచర్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేస్తూ.. మేకిన్ ఇండియా ప్రమాణాలను తప్పనిసరి చేసే నిబంధనను జోడించి కొత్తగా మరో టెండర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సరఫరాదారు రెండేళ్ల వ్యవధిలో దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలి. అలాగే క్రమంగా స్థానిక

Most from this category