STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై క్రిప్టోకరెన్సీ సేవలు బంద్‌

Tuesday 13th March 2018
news_main1520961991.png-14646

ముంబై: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమరా? అయితే ఇక మీరు మీ బ్యాంక్‌ కార్డుల ద్వారా క్రిప్టోకరెన్సీ సంబంధిత లావాదేవీలు నిర్వహించడం వీలుపడదు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తాజాగా తన క్రెడిట్‌, డెబిట్‌, ప్రిపెయిడ్‌ కార్డులపై క్రిప్టోకరెన్సీల కొనుగోలు, ట్రేడింగ్‌ సర్వీసులను బ్లాక్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. క్రిప్టోకరెన్సీలపై అంతర్జాతీయంగా భయాలు పెరుగుతోన్న నేపథ్యంలో బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా క్రిప్టోకరెన్సీపై హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. కాగా భారత్‌లో క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత లేదు.     



You may be interested

గీతాంజలి జెమ్స్‌కు ఎన్‌ఎస్‌ఈ జరిమానా

Tuesday 13th March 2018

మరో 23 కంపెనీలపై కూడా  క్యూ3 ఫలితాలు దాఖలు చేయనందుకు  ముంబై: గీతాంజలి జెమ్స్‌ సహా మరో 23 కంపెనీలపై నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ జరిమానాలు విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను దాఖలు చేయనందుకు గాను ఎన్‌ఎస్‌ఈ ఈ జరిమానాలు విధించింది. ఆర్థిక ఫలితాల దాఖలు సంబంధించి నియమనిబంధనలు పాటించకపోతే, ఎన్‌ఎస్‌ఈ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఈ కంపెనీల ట్రేడింగ్‌ను సస్పెండ్‌ చేయడం

ఎస్‌బీఐలో 41.2 లక్షల ఖాతాలు క్లోజ్‌

Tuesday 13th March 2018

కనీస నిల్వ లేకపోవడం వల్లేనని బ్యాంకు వెల్లడి ఇండోర్‌: ప్రభుత్వరంగ ఎస్‌బీఐ కనీస నిల్వలేమి కారణంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా 41.2 లక్షల సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలను మూసేసింది. కనీస బ్యాలన్స్‌ల నిర్వహణలో విఫలమైతే చార్జీల విధింపును గతేడాది ఏప్రిల్‌ నుంచి బ్యాంకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అలాగే, ఏప్రిల్‌ నుంచి ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం జరిగిన విషయం

Most from this category