STOCKS

News


ఈ నెల 16 నుంచి హెచ్‌ఏఎల్‌ ఐపీఓ

Tuesday 13th March 2018
Markets_main1520960686.png-14636

  • 20న ముగింపు 
  • ధర శ్రేణి రూ.1,215-1,240
  • రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు రూ.25 డిస్కౌంట్‌ 
  • ఇష్యూ సైజ్‌ రూ.4,230 కోట్లు 

ముంబై: హెలికాప్టర్లు, తేలిక రకం యుద్ధ విమానాలు  తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 16(ఈ శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ మహారత్న కంపెనీలో ప్రభుత్వం 20.20 శాతం వరకూ వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నది. ఈ ఐపీఓ ధర శ్రేణిని రూ.1,215-1,240గా కంపెనీ నిర్ణయించింది.  ఈ నెల 20న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.4,230 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు, ఉద్యోగులకు ఆఫర్‌ ధరలో రూ25 తగ్గింపునిస్తోంది. 

ఈ ఐపీఓలో భాగంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో రూ.10 ముఖ విలువ గల 3.41 కోట్ల షేర్లను విక్రయిస్తారు. వీటిల్లో 6.6 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించారు. ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ఈ కంపెనీలో వాటా విక్రయం జరుగుతోంది.ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఎస్‌బీఐ క్యాప్స్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. 

రూ.68,000 కోట్ల ఆర్డర్‌ బుక్‌...
ఈ కంపెనీ అమ్మకాల్లో  91 శాతానికి పైగా రక్షణ రంగం నుంచే వస్తున్నాయి.  గత ఆర్థిక సంవత్సరంలో ఈ  కంపెనీ రూ.18,600 కోట్ల ఆదాయంపై రూ.3,580 కోట్ల నికర లాభం సాధించింది. 1940లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ప్రస్తుతం 27 రకాల  హెలికాప్టర్లను, తేలిక రకం యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. వైమానిక రంగంలో ప్రపంచంలోనే 39వ అతి పెద్ద కంపెనీ ఇది. కాగా తమ ఆర్డర్‌ బుక్‌ రూ.68,000 కోట్లుగా ఉందని, రానున్న మూడేళ్లలో ఈ ఆర్డర్లను తీర్చాలని కంపెనీ తాత్కాలిక చైర్మన్‌ విఎమ్‌ చమోలా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.5,300 కోట్ల ఆదాయం సాధించామని పేర్కొన్నారు. 



You may be interested

కాల్‌ డ్రాప్స్‌పై టెల్కోలకు షోకాజ్ నోటీసులు

Tuesday 13th March 2018

 వారాంతంలోగా వివరణనివ్వాలని ట్రాయ్‌ ఆదేశాలు న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి సంబంధించి కొత్త నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడంలో విఫలమైనందుకు గాను కొన్ని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వారాంతంలోగా వివరణనివ్వాలని ఆదేశించింది. ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ ఈ విషయాలు వెల్లడించారు. అయితే, ఏయే కంపెనీలకు నోటీసులు ఇచ్చినదీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. గతేడాది అక్టోబర్‌-డిసెంబర్ మధ్య కాలంలో

బ్రాడ్‌కామ్‌ డీల్‌కు ట్రంప్ బ్రేకులు..

Tuesday 13th March 2018

 క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసే ప్రయత్నాలకు గండి  జాతీయ భద్రతా కారణాల సాకు  117 బిలియన్ డాలర్ల డీల్‌ వాషింగ్టన్‌: చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసేందుకు సింగపూర్‌ సంస్థ బ్రాడ్‌కామ్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఈ డీల్‌కు అనుమతివ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ క్వాల్‌కామ్‌ను గానీ బ్రాడ్‌కామ్ టేకోవర్ చేసిన పక్షంలో ఆ సంస్థ అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే విధమైన

Most from this category