News


'దివాలా చట్టం'పై ఎస్సార్ స్టీల్‌కు చుక్కెదురు

Tuesday 18th July 2017
news_main1500320720.png-5531

  •  చర్యలు నిలిపివేయాలన్న అభ్యర్ధనకు కోర్టు  నో

అహ్మదాబాద్: దివాలా చట్టం కింద చర్యలు నిలిపివేయాలంటూ గుజారాత్ హైకోర్టును ఆశ్రయించిన ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్‌ స్టీల్‌కు చుక్కెదురైంది. కంపెనీ అభ్యర్ధనను న్యాయస్థానం కొట్టేసింది. ఎస్సార్ స్టీల్ రుణభారం రూ.42,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇలా మొండిబాకీల భారం పెరిగిపోయిన 12 కంపెనీలపై ఆర్‌బీఐ సూచనల మేరకు బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఎస్సార్ స్టీల్‌.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మిగతా మొండి బాకీల కంపెనీల తరహాలో తమ సంస్థను కూడా జమ కట్టరాదని కంపెనీ పేర్కొంది. రూ. 20,000 కోట్ల వార్షిక టర్నోవరుతో తమ కంపెనీ ఇంకా పనిచేస్తూనే ఉందని, రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలు తుది దశలో ఉన్న తరుణంలో ఇలాంటి చర్యలు సరి కాదని వాదించింది. ఆర్‌బీఐ గానీ సర్క్యులర్ జారీ చేయకపోయి ఉంటే ఎస్‌బీఐ కన్సార్షియం తమపై దివాలా చర్యలకు ఉపక్రమించేది కాదని తెలిపింది. మరోవైపు, ఎస్సార్ స్టీల్ వాస్తవాలను తొక్కిపెట్టి కోర్టును పక్కతోవ పట్టిస్తోందంటూ ఆర్‌బీఐ తరఫు న్యాయవాది డేరియస్ ఖంబాటా వాదించారు. ఎస్సార్ స్టీల్ ఒక దశలో తమ కేసును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) పంపే విషయంలో సుముఖత వ్యక్తం చేసిందని, కానీ ఆ విషయాన్ని మాత్రం తమ పిటీషన్‌లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఒకవేళ సదరు అంశం వెల్లడించి ఉంటే న్యాయస్థానం పిటీషన్‌ను ముందుగానే కొట్టిపారేసి ఉండేదని వివరించారు. 
మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సింది..
పిటీషన్ కొట్టివేత దరిమిలా.. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను పూర్తి చేసేందుకు తమకు మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సిందని ఎస్సార్ స్టీల్ వ్యాఖ్యానించింది. ఈ దశలో దివాలా చర్యలు చేపడితే.. కంపెనీ కార్యకలాపాలు మరింతగా దెబ్బతింటాయని, మొండి బాకీ సమస్యకు పరిష్కారం ఇంకా జటిలం కాగలదని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఎన్‌సీఎల్‌టీ ముందు తమ వాదనలు వినిపిస్తామని ఎస్సార్ స్టీల్ తెలిపింది. You may be interested

ఎన్‌పీఏలపై ఆర్‌బీఐకి వారం గడువు

Tuesday 18th July 2017

నిపుణుల నివేదికపై స్పందన తెలియజేయాలన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారానికి చర్యల్ని సూచిస్తూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై వారం రోజుల్లోగా స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరడంతో వీటి పరిష్కారంపై చర్యల్ని సూచించేందుకు గాను ఆర్‌బీఐ ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ‍కమిటీ 12 బడా రుణ ఎగవేత

నెలలో ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌: లిమాయే

Tuesday 18th July 2017

కో లొకేషన్‌ అంశంపై పరిష్కారమే తొలి ప్రాధాన్యం ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీ లిమాయే న్యూఢిల్లీ: కో లొకేషన్‌ అంశంపై ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) నెలలోపు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక సమర్పించనుందని ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీ విక్రమ్‌ లిమాయే తెలిపారు. దీనిపై సకాలంలో తగిన పరిష్కారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ నూతన ఎండీగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం లిమాయే మీడియాతో మాట్లాడారు. కో లొకేషన్‌ అంశాన్ని పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యమన్నారు.

Most from this category