STOCKS

News


ఈ నెల 16 నుంచి పసిడి బాండ్ల అమ్మకం

Friday 13th April 2018
news_main1523640550.png-15505

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి విడత పసిడి బాండ్ల విక్రయం ఏప్రిల్ 16న ప్రారంభం కానుంది. ఈ నెల 20 దాకా కొనుగోలుకు దరఖాస్తులు స్వీకరణ, మే 4న సర్టిఫికెట్స్ జారీ ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సావరీన్ గోల్డ్ బాండ్ 2018-19 సిరీస్-1 కింద బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ.. బీఎస్‌ఈ స్టాక్ ఎక్స్చేంజీల్లో వీటి విక్రయం ఉంటుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి.. ఇష్యూ ధరతో పోలిస్తే గ్రాముకు రూ. 50 మేర రేటు తగ్గుతుంది. ఈ స్కీము కింద కనిష్టంగా 1 గ్రాము విలువ చేసే యూనిట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్టంగా 500 గ్రాముల దాకా కొనుగోలు చేయొచ్చు. 



You may be interested

నిఫ్టీ తర్వాత టార్గెట్‌ 10600?!

Saturday 14th April 2018

నిపుణుల అంచనా నిఫ్టీ డైలీ చార్టుల్లో డోజీ క్యాండిల్‌, వారం చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరుస్తూ వారాన్ని ముగించింది. కీలకమైన 10350 పాయింట్లపైన ముగియడంతో సూచీలో బలహీనత తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇదే తరహా బలం చూపితే త్వరలో నిఫ్టీ 10600 పాయింట్ల వరకు ఎగబాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వారాంతంలో బుల్స్‌కు బలం తగ్గడంతో చివరి సెషన్‌లో డోజీ క్యాండిల్‌ ఏర్పడిందని చార్ట్‌వ్యూ ఇండియా ప్రతినిధి మజార్‌ మొహమద్‌

మహీంద్రా లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్‌ బ్రాండ్‌.. ‘ఆటోమొబిలి పినిన్ఫారిన’

Friday 13th April 2018

2020లో మార్కెట్‌లోకి తొలి వెహికల్‌ న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ తాజాగా తన లగ్జరీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ బ్రాండ్‌ ‘ఆటోమొబిలి పినిన్ఫారిన’ను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్‌ గ్లోబల్‌ కస్టమర్ల కోసం అధిక పనితీరు, ఆధునాతన టెక్నాలజీ వంటి ప్రత్యేకతలతో లగ్జరీ ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తుందని కంపెనీ తెలిపింది. ‘ఆటోమొబిలి పినిన్ఫారిన’కు ఆడి ఇండియా మాజీ హెడ్‌ మైకేల్‌ సీఈవోగా వ్యవహరిస్తారని పేర్కొంది. కాగా

Most from this category