STOCKS

News


నాబార్డ్‌ అధీకృత మూలధనం రూ.30వేల కోట్లకు

Monday 16th April 2018
news_main1523860022.png-15530

న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నాబార్డ్‌ అధీకృత మూలధనాన్ని రూ,.30,000 కోట్లకు పెంచింది. దీంతో గ్రామీణాభివృద్ధి, సాగుకు మరిన్ని రుణాలు అందించడం ద్వారా తన కార్యకలాపాలు పెంచుకునేందుకు నాబార్డ్‌కు వీలు పడనుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన జాతీయ బ్యాంకు (నాబార్డ్‌) అధీకృత మూలధనాన్ని రూ.5,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచినట్టు ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది.



You may be interested

బ్యాంకుల నెత్తిన ‘గీతాంజలి’ బండ

Monday 16th April 2018

క్యూ4లో ఎన్‌పీఏలు రూ.8,000 కోట్లు పెరిగే అవకాశం  న్యూఢిల్లీ: కుంభకోణంలో చిక్కుకున్న గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిపోవడంతో మార్చి త్రైమాసికంలో బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,000 కోట్ల మేర పెరిగిపోనున్నాయి. గీతాంజలి జెమ్స్‌ గ్రూపునకు ఇచ్చిన వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు రూ.8,000 కోట్లకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎటువంటి చెల్లింపులు జరగలేదు. దీంతో ఈ మొండి బకాయిలకు నిధులు కేటాయించాల్సి ఉంటుందని బ్యాంకింగ్‌

భారీ ఎగుమతులు, పెట్టుబడులతోనే 8శాతం వృద్ధి సాధ్యం

Monday 16th April 2018

భారత్‌పై ఏడీబీ అభిప్రాయం.. న్యూఢిల్లీ: పెట్టుబడులకు పునరుత్తేజం, ఎగుమతులు భారీగా పెంచుకోగలిగితేనే భారత్‌ నిలకడగా 8 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించగలుగుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) పేర్కొంది. ‘ప్రస్తుతం పెట్టుబడులు, ఎగుమతులు ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. ఈ రెండు చోదకాలు గనుక జోరందుకుంటే 8 శాతం వృద్ధి సాధ్యమే. వ్యవసాయ మార్కెటింగ్‌ను గాడిలోపెట్టడం, సరఫరాపరమైన అడ్డంకులను తొలగించడం వంటివి కూడా చాలా కీలకం. ఈ రెండు అంశాల్లో మరిన్ని సంస్కరణలకు

Most from this category