News


జీఎస్‌టీకి ముందున్న రేట్లు తెచ్చేందుకే!!

Tuesday 12th September 2017
news_main1505240947.png-8457

  • కార్ల సెస్సు పెంపుపై ప్రభుత్వం నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ: మధ్య శ్రేణి, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై 7 శాతం దాకా అదనంగా పెంచిన జీఎస్‌టీ సెస్సుపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం మధ్య స్థాయి కార్లపై మొత్తం జీఎస్‌టీ రేటు 45 శాతంగాను, పెద్ద కార్లపై 48 శాతంగాను, ఎస్‌యూవీలపై 50 శాతంగాను ఉంటుంది. వాహనాల ధరలను జీఎస్‌టీ అమలుకు ముందున్న రేట్ల స్థాయికి తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మధ్య స్థాయి కార్లపై 2 శాతం, పెద్ద కార్లపై 5 శాతం, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలపై 7 శాతం మేర సెస్సును పెంచినట్లు అందులో తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 9న జరిగిన సమావేశంలో జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో అంతక్రితం కన్నా తక్కువ పన్ను రేటు ఉండటంతో పెద్ద కార్ల ధరలను కంపెనీలు సుమారు రూ.3 లక్షల దాకా తగ్గించాయి. అయితే, ఈ వ్యత్యాసాన్ని సరిదిద్దే ప్రయత్నాల్లో భాగంగానే జీఎస్‌టీ కౌన్సిల్ సెస్సును పెంచింది. ఇందుకోసం జూన్ 28, 2017 నాటి పరిహార సెస్సు (రేటు) నోటిఫికేషన్‌కు సవరణలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. చిన్న పెట్రోల్‌, డీజిల్ కార్లు, హైబ్రీడ్ కార్లపై మాత్రం సెస్సును పెంచలేదని పేర్కొంది. జీఎస్‌టీ విధానంలో కార్లకు అత్యధికంగా 28 శాతం పన్ను శ్లాబ్ వర్తిస్తుంది. దీనికి అదనంగా సెస్సు కూడా వర్తిస్తుంది.







You may be interested

ధరలు పైకి... పారిశ్రామిక ఉత్పత్తి దిగువకు!

Wednesday 13th September 2017

 ఆర్థిక గణాంకాల నిరుత్సాహం  జూలైలో పారిశ్రామిక వృద్ధి 1.2 శాతం  ఆగస్టులో ఐదు నెలల గరిష్టానికి రిటైల్‌ ధరల స్పీడ్‌ న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక గణాంకాలు ఇంకా నిరుత్సాహంగానే కొనసాగుతున్నట్లు మంగళవారం వెలువడిన గణాంకాలు స్పష్టంచేశాయి. 2017 జూలై పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 4.5 శాతం. ఇక ఏప్రిల్‌-జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు

షెల్‌ కంపెనీలపై కొరడా..

Tuesday 12th September 2017

1 లక్ష మంది డైరెక్టర్లపై అనర్హత వేటు!! న్యూఢిల్లీ: నల్లధనంపై పోరులో భాగంగా డొల్ల కంపెనీలు నిర్వహిస్తున్న వారిపై మరిన్ని కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. షెల్ కంపెనీలతో సంబంధమున్న దాదాపు 1.06 లక్షల మంది పైగా డైరెక్టర్లపై అనర్హత వేటు పడనుంది. సెప్టెంబర్ 12 నాటికి కంపెనీల చట్టంలోని సెక్షన్ 164 కింద అనర్హత వేటు వేయతగిన డైరెక్టర్లుగా 1,06,578 మందిని గుర్తించినట్లు, వీరిపై ఆమేరకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్రం

Most from this category