STOCKS

News


పెట్రోల్‌పై ఎక్సయిజ్ తగ్గింపుపై కేంద్రం మౌనం

Friday 18th May 2018
news_main1526665503.png-16609

న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరల కారణంగా భారత్ దిగుమతుల బిల్లు 50 బిలియన్ డాలర్ల మేర ఎగిసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ గర్గ్ పేర్కొన్నారు. దీనివల్ల కరెంటు అకౌంటు లోటుపై మరింత ప‍్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. అయితే, సామాన్య వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించే విషయంపై మాత్రం మౌనం వహించిన గర్గ్‌.. 'చూస్తూ ఉండండి' అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో అయిదేళ్ల గరిష్ట స్థాయి రూ. 75.61కి చేరిన నేపథ్యంలో గర్గ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రభుత్వ రుణ సమీకరణ లక్ష్యాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని గర్గ్ తెలిపారు. 2018-19లో 3.3 శాతం ద్రవ్య లోటు భర్తీ కోసం ప్రభుత్వ బాండ్ల జారీ ద్వారా రూ. 6.05 లక్షల కోట్లు సమకూర్చుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్‌-సెప్టెంబర్ మధ్య కాల్లో రూ. 2.88 లక్షల కోట్లు సమీకరించనుంది. బడ్జెట్‌లో నిర్దేశిత రుణ సమీకరణలో ఇది 47.56 శాతం. 



You may be interested

10,550 వద్ద కీలకమద్దతు..!

Saturday 19th May 2018

ముంబై: ప్రస్తుత మార్కెట్‌లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని, లాంగ్‌లో ఉంటే 10,550 వద్ద కచ్చితంగా స్టాప్‌లాస్‌ నిర్వహించడం మంచిదని చార్ట్‌వ్యూఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్ రీసెర్చ్ అండ్ ట్రేడింగ్ అడ్వైజరీ చీఫ్ స్ట్రాటజిస్ట్ మజర్ మహమ్మద్ సూచించారు. నిఫ్టీ ఈస్థాయిని కోల్పోయినట్లయితే మరో 1-2 శాతం మేర పతనం అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. శుక్రవారం నిఫ్టీ 10,600 పాయిం‍ట్ల దిగువన ముగిసిన తరువాత.. ఇక్కడ నుంచి 50

శ్రీలంకకు వచ్చే తెలుగు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది

Friday 18th May 2018

 శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ఏపీ, తెలంగాణ మేనేజర్‌ చమ్మిక ఇద్దగోడగే సాక్షి, అమరావతి: ప్రతీ ఏటా శ్రీలంకకు వచ్చే తెలుగు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోందని శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ఏపీ, తెలంగాణ మేనేజర్‌ చమ్మిక ఇద్దగోడగే తెలిపారు. గతేడాది జులైలో హైదారాబాద్‌, విశాఖపట్నంల నుంచి కొలంబోకు ప్రారంభించిన డైరెక్ట్‌ విమానాలతో ప్రయాణీకుల సంఖ్య గణణీయంగా పెరిగిందని చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. 2016-17లో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ద్వారా ​‍7,000 మంది

Most from this category