STOCKS

News


ఈ బడ్జెట్లో ఉద్యోగాలపైనే ఫోకస్‌

Friday 12th January 2018
news_main1515780636.png-13093

  •  కార్వీ చైర్మన్‌ పార్థసారథి అంచనా
  •  పన్ను మినహాయింపులుండొచ్చు
  •  సీఏలు అజయ్‌ గాంధీ, విక్రమ్‌ ఆశాభావం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిబ్రవరి 1న ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఉద్యోగ అవకాశాల సృష్టికి ఉపయోగపడేదిగా ఉండవచ్చని కార్వీ గ్రూప్‌ చైర్మన్‌ సి.పార్థసారథి అంచనా వేశారు. జనాకర్షక బడ్జెట్‌ 2019లో ఉండవచ్చని, ఈ ఏడాది మాత్రం ఉద్యోగ సృష్టి చర్యలను చేపట్టే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఉద్యోగ అవకాశాలనేవి కార్పొరేట్లకు పన్ను రాయితీలు కల్పించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని, కాబట్టి ఈ బడ్జెట్‌లో దీనిపై దృష్టిసారించే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫినాపోలిస్‌ నాలెడ్జ్‌ సిరీస్‌ ఆధ్వర్యంలో ‘‘2018 కేంద్ర బడ్జెట్‌; అభివృద్ధి, ఎంప్లాయిమెంట్‌కు ఊతమిస్తుందా?’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ అండ్‌ గాంధీ చార్డెట్‌ అకౌంట్‌ పార్టనర్‌ అజయ్‌ గాంధీ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో వేతనజీవులకు కొంత పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలున్నాయన్నారు. ‘‘రూ.10 లక్షలు, రూ.20 లక్షల పన్ను శ్లాబులను పొడిగించడమో లేక అదనంగా మరో శ్లాబ్‌ పెట్టడమో చేయవచ్చని ఆయన అంచనా వేశారు. సెక్షన్‌ 80సీ పరిధిలోని మినహాయింపులను రూ.3 లక్షల వరకు పెంచే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘2019లో ఎన్నికలుండటం మూలంగా ఆ బడ్జెట్‌లోనే జనాకర్షక పథకాలుండే అవకాశముంది. ఈసారి సామాన్యులకు నిరాశే మిగలవచ్చు’’ అని చర్చలో పాల్గొన్న బిజినెస్‌ స్టాండర్డ్‌ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ ఏకే భట్టాచార్య చెప్పారు. ధనవంతులపై క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ విధించే ప్రయత్నం చేయవచ్చని... సామాన్య ప్రజానికానికి ఇది హర్షదాయకంగానే ఉండవచ్చని చెప్పారాయన. ప్రభుత్వం ఆర్ధికపరమైన జాగ్రత్తలకు కట్టుబడి ఉన్నా... వ్యయం ద్వారానే ఉద్యోగాలను సృష్టించటం, వృద్ధిని వేగవంతం చేయటం సాధ్యమవుతుందని చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఎంఆర్‌ విక్రమ్‌ అభిప్రాయపడ్డారు.


 You may be interested

యమహా ‘ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ’లో కొత్త వెర్షన్‌

Friday 12th January 2018

ధర రూ.86,042 న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ యమహా మోటార్‌ ఇండియా తాజాగా తన ‘ఎఫ్‌జెడ్‌ఎస్‌-ఎఫ్‌ఐ’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.86,042. మెరుగైన బ్రేకింగ్‌ వ్యవస్థ, మంచి పనితీరు సామర్థ్యంతో ఈ బైక్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందులో 149 సీసీ, ఎయిర్‌ కూల్డ్‌, 4 స్ట్రోక్‌ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది. 220 ఎంఎం హైడ్రాలిక్‌ సింగిల్‌ రియర్‌ డిస్క్‌

పగ్గాలు తెంచుకున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం

Friday 12th January 2018

డిసెంబర్‌లో 5.21 శాతానికి చేరిక నవంబర్‌లో ఇది 4.88 శాతం న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత మరోసారి దౌడుతీసింది. ఆహారోత్పత్తులు, కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలతో ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని దాటేసుకుని గడిచిన డిసెంబర్‌ మాసంలో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలన్నీ ఆవిరయ్యాయి. వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్‌)  ద్రవ్యోల్బణం గత నవంబర్‌ నెలలో 4.88

Most from this category